బొచ్చులో న్యాయకత్వం.. సొంత పార్టీ నేతలపై వైసీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

Published : Mar 19, 2020, 12:22 PM ISTUpdated : Mar 19, 2020, 01:22 PM IST
బొచ్చులో న్యాయకత్వం.. సొంత పార్టీ నేతలపై వైసీపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

సారాంశం

వైసీపీలోని రెండు వర్గాలు తమ  అభిమాన నేతకు ఛైర్మన్ సీటు ఇవ్వాలని కోరడంతో అంతర్గతంగా ముసలం మొదలైంది. దీనిపై ఎంపీ రఘురామ కృష్ణం రాజు మీడియాతో మాట్లాడారు. అందరం మంత్రి మోపిదేవితో చర్చించి ఏకాభిప్రాయంతో ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

సొంత పార్టీ నేతలపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన కామెంట్స్ చేశారు. బొచ్చులో న్యాయకత్వం అంటూ...తమ సొంత పార్టీ కార్యకర్తలని తక్కువ చేస్తూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 

Also Read టిడిపిని ఓడించడానికే ఎన్నికల వాయిదా... వారి కుట్రే: నిమ్మల రామానాయుడు...

ఇంతకీ మ్యాటరేంటంటే... పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ ఎంపిక విషయంలో స్థానికంగా విభేదాలు తలెత్తాయి. వైసీపీలోని రెండు వర్గాలు తమ  అభిమాన నేతకు ఛైర్మన్ సీటు ఇవ్వాలని కోరడంతో అంతర్గతంగా ముసలం మొదలైంది. దీనిపై ఎంపీ రఘురామ కృష్ణం రాజు మీడియాతో మాట్లాడారు. అందరం మంత్రి మోపిదేవితో చర్చించి ఏకాభిప్రాయంతో ఛైర్మన్ ఎంపిక ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఎంపీ హామీ ఇస్తుండగానే పార్టీ కార్యకర్తలు జై జగన్, జగన్ నాయకత్వం వర్దిల్లాలి, రఘురామ కృష్ణం రాజు నాయకత్వం వర్దిల్లాలని నినాదాలు చేశారు. పనిలో పనిగా ఓ కార్యకర్త మంత్రి చెరుకువాడ రంగనాథరాజు నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేయడంతో ఎంపీ అసహనానికి లోనయ్యారు. ఎవడి నాయకత్వం కావాలి.. బొచ్చులో నాయకత్వం, నోరు మూసుకు కూర్చోవాలంటూ కార్యకర్తలపై మండిపడ్డారు. వైసీపీ ఎంపీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్