కరోనా దెబ్బకు ఏపీఎస్ఆర్‌టీసీ నష్టాల బాటలో నడుస్తోంది. నాలుగు నెలల్లో ఆర్టీసీ సుమారు రూ. 5 వేల కోట్లు నష్టపోయింది. లాభాల బాటలో ఆర్టీసీని నడిపించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
అమరావతి: కరోనా దెబ్బకు ఏపీఎస్ఆర్‌టీసీ నష్టాల బాటలో నడుస్తోంది. నాలుగు నెలల్లో ఆర్టీసీ సుమారు రూ. 5 వేల కోట్లు నష్టపోయింది. లాభాల బాటలో ఆర్టీసీని నడిపించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 12 వేల బస్సులు ఉన్నాయి. కరోనా కారణంగా కేవలం రెండు బస్సులు మాత్రమే బస్సులు నడుస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుండి ఆర్టీసీ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది.
undefined
also read:తిరుమలకు కరోనా దెబ్బ: సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
ఈ ఏడాది మే 21వ తేదీన ఏపీ రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు ప్రారంభమయ్యాయి. 12 వేల బస్సుల్లో రెండు వేల బస్సులు మాత్రం రోడ్డెక్కాయి. దీంతో ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను ప్రభుత్వం తొలగించింది. తాత్కాలిక ఉద్యోగుల పనులను శాశ్వత ఉద్యోగులు నిర్వహిస్తున్నారు.
కరోనా కు ముందు రాష్ట్రంలో 12 వేల బస్సుల్లో రోజూ 60 లక్షల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చేవారు. కానీ ప్రస్తుతం 2 వేల బస్సుల్లో రెండు లక్షల మంది ప్రయాణీకులను మాత్రమే గమ్యస్థానాలకు చేర్చుతున్నారు.
also read:కరోనా దెబ్బ: తెలంగాణ ఆర్టీసీకి 4 నెలల్లో రూ. 1000 కోట్ల నష్టం
అంతరాష్ట్ర బస్సు సర్వీసులు ఇంకా ప్రారంభం కాలేదు. కర్ణాటక రాష్ట్రానికి ఏపీ నుండి బస్సులను ప్రారంభించారు. తమిళనాడు, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు బస్సు సర్వీసుల ప్రారంభంపై ఇంకా స్పష్టత లేదు. అంతేకాదు సిటీ బస్సుల రాకపోకలు ఎప్పుడు ప్రారంభమౌతాయో కూడ చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడానికి ప్రజలు భయపడుతున్నారు. తప్పనిసరి పరిస్థితులైతేనే బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఎక్కువగా స్వంత వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఆక్యుపెన్సీ రేటు దారుణంగా పడిపోయింది.
బస్సులో ప్రయాణీకులకు శానిటైజర్ సరఫరాతో పాటు బస్సులను శానిటేషన్ చేయడం కూడ ఆర్టీసీకి భారంగా మారింది. డీజీల్ ధరలు విపరీతంగా పెరగడంతో ఆర్టీసీకి నిర్వహణ భారం రోజు రోజుకు పెరిగిపోతోంది.
బస్సులను నడుపుతున్నా కూడ ఆదాయం అంతంతమాత్రమే. ఆశించిన మేర ఆదాయం రాని కారణంగా బస్సులు నడిపి కూడ ప్రయోజం లేకుండా పోయింది. దీంతో ఇంద్ర బస్సులను కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా సంజీవని బస్సులుగా మార్చారు. జిల్లాకో బస్సులను ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇప్పటికే 140 మంది ఆర్టీసీ ఉద్యోగులకు కరోనా సోకింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన 40 మంది ప్రయాణీకులు కూడ కరోనా బారినపడ్డారు.
మార్చి 22 నుండి ఇప్పటివరకు ఏపీఎస్ఆర్టీసీ సుమారు రూ. 5 వేల కోట్లను నష్టపోయినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే తీవ్రంగా ఇబ్బందుల్లో ఆర్టీసీకి ఈ నష్టం కోలుకోలేని దెబ్బేనని ఆర్టీసీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.