ఒక్క రోజులోనే 9 మంది మృతి: ఏపీలో 17 వేలకు చేరువలో కరోనా కేసులు

Published : Jul 03, 2020, 12:48 PM ISTUpdated : Jul 03, 2020, 01:00 PM IST
ఒక్క రోజులోనే 9 మంది మృతి: ఏపీలో 17 వేలకు చేరువలో కరోనా కేసులు

సారాంశం

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల్లో 837 కరోనా కేసులు నమోదయ్యాయి.ఒక్కరోజులోనే కరోనాతో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల్లో 837 కరోనా కేసులు నమోదయ్యాయి.ఒక్కరోజులోనే కరోనాతో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

 

రాష్ట్రంలో కరోనా కేసులు 16,934కి చేరుకొన్నట్టుగా ప్రభుత్వం విడుదల చేసిన బులిటెన్ తెలిపింది.  రాష్ట్రంలో 9,096 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. మరో వైపు 7632 మంది కరోనా నుండి కోలుకొన్నట్టుగా ప్రభుత్వం వివరించింది.

also read:ఇండియాలో తొలిసారి 24 గంటల్లో రికార్డు స్థాయిలో 20 వేల కేసులు

రాష్ట్రంలో కరోనాతో 206 మంది మరణించినట్టుగా ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్ తెలిపింది.రాష్ట్రంలోని కర్నూల్  జిల్లాలో అద్యధిక కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ జిల్లాలో 2236 కేసులు నమోదయ్యాయి. కర్నూల్ తర్వాతి స్థానంలో అనంతపురం జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 1972 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 1611 కేసులు నమోదయ్యాయి. నాలుగో స్థానంలో గుంటూరు జిల్లా నిలిచింది. ఇక్కడ 1610 కేసులు రికార్డయ్యాయి.

గత 24 గంటల్లో విదేశాల నుండి వచ్చినవారిలో ఇద్దరికి కరోనా సోకింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చినవారిలో 46 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్