చిత్తూరులో కరోనా ఉధృతి: ఏపీలో మొత్తం కేసులు 20,22,064కి చేరిక

By narsimha lode  |  First Published Sep 6, 2021, 6:36 PM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో కరోనా కేసులు 739 నమోదయ్యాయి. కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది.



అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో43,594 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 739 మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,22,064 కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 14 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 13,925 కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 1333 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 93వేల 589 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 14,550 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,69,82,661 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

Latest Videos

గత 24 గంటల్లో అనంతపురంలో003,చిత్తూరులో 166, తూర్పుగోదావరిలో058,గుంటూరులో066,కడపలో 098, కృష్ణాలో064, కర్నూల్ లో000, నెల్లూరులో114, ప్రకాశంలో 094,విశాఖపట్టణంలో 054,శ్రీకాకుళంలో011, విజయనగరంలో 002,పశ్చిమగోదావరిలో 009 కేసులు నమోదయ్యాయి.


గత 24 గంటల్లో కరోనాతో  14 మంది చనిపోయారు.చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో నలుగురి చొప్పున మరణించారు. కృష్ణా, నెల్లూరులలో ఇద్దరి చొప్పున చనిపోయారు. అనంతపురం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున చనిపోయారు.దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,925కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,253, మరణాలు 1092
చిత్తూరు-2,39,395, మరణాలు1863
తూర్పుగోదావరి-2,86,935, మరణాలు 1263
గుంటూరు -1,73,237,మరణాలు 1186
కడప -1,13,159, మరణాలు 631
కృష్ణా -1,14,537,మరణాలు 1330
కర్నూల్ - 1,23,854,మరణాలు 850
నెల్లూరు -1,41,226,మరణాలు 1012
ప్రకాశం -1,34,388, మరణాలు 1058
శ్రీకాకుళం-1,22,228, మరణాలు 779
విశాఖపట్టణం -1,55,8347, మరణాలు 1106
విజయనగరం -82,522, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,75,088, మరణాలు 1086

 

: 06/09/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,19,169 పాజిటివ్ కేసు లకు గాను
*19,90,694 మంది డిశ్చార్జ్ కాగా
*13,925 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 14,550 pic.twitter.com/cBRppdTOYO

— ArogyaAndhra (@ArogyaAndhra)

 

click me!