ఎమ్మెల్యే కన్నబాబుకి టోకరా: నకిలీ పత్రాలతో భూమి విక్రయించిన ఇద్దరి అరెస్ట్

Published : Sep 06, 2021, 05:58 PM IST
ఎమ్మెల్యే కన్నబాబుకి టోకరా: నకిలీ పత్రాలతో భూమి విక్రయించిన ఇద్దరి అరెస్ట్

సారాంశం

విశాఖ జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు  నకిలీ పత్రాలతో భూమిని విక్రయించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. భూమి అసలు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.

విశాఖపట్టణం: విశాఖపట్టణం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు  నకిలీ పత్రాలతో భూమిని విక్రయించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

విశాఖ జిల్లాలోని కొమ్మాది ప్రాంతంలో 12 ఎకరాల 26 సెంట్ల భూమిని ఎమ్మెల్యే  కన్నబాబు కొనుగోలు చేశాడు. ఈ భూమిని ఇద్దరు వ్యక్తులు విక్రయించారు. అయితే ఈ భూమి అసలు యజమానులు  పోలీసులకు ఫిర్యాదు చేుయడంతో ఈ విషయం వెలుగు చూసింది.

 భూమిని విక్రయించిన వారు నిజమైన యజమానులు అవునో కాదో నిర్ధారించుకోకుండా ఎమ్మెల్యే ఈ భూమిని ఎలా కొనుగోలు చేశారనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయమై ఎమ్మెల్యే కన్నబాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆ ఇద్దరు నిందితులు ఎమ్మెల్యేకు భూమిని విక్రయించిన వారి వెనుక ఎవరైనా ఉన్నారా, వీరిద్దరే ఈ  పనికి పూనుకొన్నారా అనే విషయమై కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకొనే నకిలీ పత్రాలతో ఈ భూమి విక్రయించడం వెనుక ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే విషయమై కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Weather Update : ఈ తెలుగు జిల్లాల్లో వింత వెదర్.. పగలంతా పీక్ ఎండలతో ఆరెంజ్, సాయంత్రం జోరువానలతో ఎల్లో అలర్ట్
రాముడికి దండ వేయడానికి వెళ్తే..మేకులు, కర్రలతో దాడి | Asianet News Telugu