బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 2 కోట్ల విలువైన తాకట్టు బంగారం గల్లంతు

By telugu teamFirst Published Sep 6, 2021, 5:44 PM IST
Highlights

గుంటూరు జిల్లా బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం గల్లంతయింది. రీజనల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది బ్యాంక్ ఎంప్లాయీస్ నిర్వాకమే అని, కేసులో పూర్తి ఆధారాలున్నాయని, ఖాతాదారులు ఆందోళన చెందవద్దని టౌన్ సీఐ పీ కృష్ణయ్య భరోసానిచ్చారు.

అమరావతి: గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 2 కోట్ల విలువ చేసే తాకట్టు బంగారం గల్లంతయింది. ఖాతాదారులు ఆ బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారం గల్లంతవ్వడం కలకలం రేపింది. ప్రజలు భయపడాల్సిన పనిలేదని, కేసులో ఆధారాలున్నాయని, త్వరలోనే ఛేదించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు. బ్యాంకులో పనిచేసే ఎంప్లాయీస్ నిర్వాకమే ఇది అని తెలిపారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా రీజనల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంకు అటెండర్ నిర్వాకంతోనే బ్యాంకులోని బంగారానికి ఎసరుపెట్టారని వివరించారు. నిందితుడికి సహకరించిన ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక గాలింపులు చేస్తున్నట్టు వివరించారు.

ఈ ఘటనపై ఖాతాదారులు భయాందోళనలకు గురికావాల్సిన పనిలేదని టౌన్ సీఐ పీ కృష్ణయ్య భరోసానిచ్చారు. కేసు పురోగతిలో ఉన్నదని, త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. కేసులో పూర్తి ఆధారాలున్నాయని వివరించారు. కేసును త్వరితగతిన ఛేదించి తదుపరి వివరాలను మీడియా ద్వారా వెల్లడిస్తామని చెప్పారు.

click me!