ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 66 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 2627కి చేరుకొన్నాయి.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 66 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 2627కి చేరుకొన్నాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 2627 పాజిటివ్ కేసు లకు గాను 1807 మంది డిశ్చార్జ్ కాగా, 56 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 764.
— ArogyaAndhra (@ArogyaAndhra)
11,357 శాంపిల్స్ పరీక్షిస్తే 66 మందికి కరోనా సోకినట్టుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో 17 విదేశాల నుండి వచ్చినవారి వల్ల కేసులు నమోదైనట్టుగా ప్రభుత్వం తెలిపింది.
: రాష్ట్రంలో గత 24 గంటల్లో (9AM-9AM) :
*11,357 సాంపిల్స్ ని పరీక్షించగా 66 మంది కోవిడ్19 పాజిటివ్ గా నిర్దారింపబడ్డారు.
*29 మంది కోవిడ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యం తో డిశ్చార్జ్ చేయబడ్డారు
కువైట్ నుండి వచ్చిన 12, దుబాయ్ నుండి వచ్చిన 3, ఖతార్ నుండి వచ్చిన ఇద్దరికి కరోనా సోకినట్టుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
also read:కరోనాపై పోరు: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు
రాష్ట్రంలో కరోనా సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొంది నయమైన వారు 1807 మంది ఉన్నారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కరోనా సోకి 56 మంది మరణించారు. ఇంకా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 764 మంది ఉన్నారని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది.కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో కోయంబేడ్ మార్కెట్ తో లింకులు 8 కేసులు ఉన్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.