బంగాళాఖాతంలో అల్ప పీడనం... ఏపీకి మూడు రోజుల పాటు వర్షసూచన

By Siva KodatiFirst Published Oct 14, 2021, 4:51 PM IST
Highlights

ఉత్తర అండమాన్‌ సముద్రంలో (north andaman sea) ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (weather center) తెలిపింది. కాగా, నైరుతి రుతుపవనాలు నిష్క్రమించే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది.

ఉత్తర అండమాన్‌ సముద్రంలో (north andaman sea) ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతుంది. దీని ప్రభావంతో గురువారంనాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో (bay of bengal) అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (weather center) తెలిపింది. కాగా, నైరుతి రుతుపవనాలు నిష్క్రమించే పరిస్థితులు ఉన్నాయని పేర్కొంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అత్యధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమ, దక్షిణ కోస్తా తీర ప్రాంతాలతో పాటు అన్ని జిల్లాలపై ద్రోణి ప్రభావం కనిపించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. అల్పపీడనం బలహీన పడిన సందర్భంలోనూ ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ వరుస వర్షాల నుంచి తెరపి లభించే పరిస్థితి లేదు. మరో విడత భారీ వర్షాలు కురవడానికి అనుకూల వాతావరణం నెలకొని ఉంది.

ALso Read:Cyclone Gulab : ఏపీలో ఇద్దరు మత్స్యకారులు మృతి, ఒకరు గల్లంతు..

ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ దాకా మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తోన్నారు. సాధారణంగా అక్టోబర్‌ను సైక్లోన్ నెలగా అభివర్ణిస్తుంటారు వాతావరణ విశ్లేషకులు. ఫైలీన్, హుద్‌హుద్, తిత్లి తుఫాన్లు ఏర్పడింది ఈ నెలలోనే. వారి అంచనాలకు అనుగుణంగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. మధ్య బంగాళాఖాతం ఉపరితలంపై ఏర్పడిన ఆవర్తనం.. క్రమంగా అల్పపీడనంగా మారుతుందని, అది మరింత బలపడి వాయుగుండంగా అవతరిస్తుందన అంచనాలు ఉన్నాయి.

అండమాన్‌ ద్వీప సముదాయానికి ఆనుకుని సుమారు 5.2 కిలోమీటర్ల ఎత్తు వరకు గాలులతో నిండిన ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, ఇది ఈ సాయంత్రానికి అల్పపీడనంగా మారుతుందని భువనేశ్వర్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ ద్రోణి 1500 కోస్తాంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల మీదుగా ఆరేబియా సముద్రంపై ఉన్న మరో ఉపరితల ఆవర్తనం వరకు వ్యాపించిందని పేర్కొన్నారు.

డైపోల్ ప్రభావంతో ఇది విస్తరించినట్లు అంచనా వేస్తోన్నారు. దీని ప్రభావం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రపై అధికంగా ఉంటుందని, క్రమంగా అది విస్తరిస్తుందని స్పష్టం చేశారు. దీని ప్రభావంతో శుక్ర, శని, ఆదివారాల్లో ఆయా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

click me!