తూ.గోదావరిలో కరోనా ఉధృతి: ఏపీలో మొత్తం కేసులు 19,20,178కి చేరిక

By narsimha lode  |  First Published Jul 10, 2021, 5:19 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఆయా జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి తగ్గించేందుకుగాను ఏపీ సర్కార్ కర్ఫ్యూను అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ అమలు చేయడం వల్ల గణనీయంగా కేసులు తగ్గాయి.


అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 95,366 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 2,925  మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,20,178 కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 26 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 12,986కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 3,937మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 18 లక్షల 77 వేల 930 కి చేరింది. ఏపీలో ప్రస్తుతం 29,262 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,28,94,611 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

Latest Videos

గత 24 గంటల్లో అనంతపురంలో084,చిత్తూరులో 414, తూర్పుగోదావరిలో611, గుంటూరులో211,కడపలో 180, కృష్ణాలో250, కర్నూల్ లో117, నెల్లూరులో199, ప్రకాశంలో 260,విశాఖపట్టణంలో 139, శ్రీకాకుళంలో067, విజయనగరంలో 032, పశ్చిమగోదావరిలో 361కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనాతో  26 మంది చనిపోయారు. చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఐదుగురి చొప్పున కరోనాతో మరణించారు. తూర్పుగోదావరిలో నలుగురు, కర్నూల్, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇద్దరి చొప్పున చనిపోయారు.కడప, ప్రకాశం, విశాఖపట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 12986కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,54,982, మరణాలు 1065
చిత్తూరు-2,24,232 మరణాలు1657
తూర్పుగోదావరి-2,69,448, మరణాలు 1173
గుంటూరు -1,64,608,మరణాలు 1112
కడప -1,08,018, మరణాలు 616
కృష్ణా -1,03,929,మరణాలు 1152
కర్నూల్ - 1,22,594,మరణాలు 831
నెల్లూరు -1,29,612,మరణాలు 923
ప్రకాశం -1,24,380, మరణాలు 942
శ్రీకాకుళం-1,19,432, మరణాలు 747
విశాఖపట్టణం -1,49,902, మరణాలు 1063
విజయనగరం -80,785, మరణాలు 666
పశ్చిమగోదావరి-1,65,361, మరణాలు 1039

 

: 10/07/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,17,283 పాజిటివ్ కేసు లకు గాను
*18,75,035 మంది డిశ్చార్జ్ కాగా
*12,986 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 29,262 pic.twitter.com/n1eLh1LI7k

— ArogyaAndhra (@ArogyaAndhra)


 

click me!