జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డికి ఏబీవీ లీగల్ నోటీసులు: పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక

Published : Aug 02, 2021, 06:53 PM IST
జగతి పబ్లికేషన్స్, విజయసాయిరెడ్డికి ఏబీవీ లీగల్ నోటీసులు: పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరిక

సారాంశం

పరువు నష్టం దావా కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ కు మాజీ ఏపీ ఇంటలిజెన్స్ బాస్ వెంకటేశ్వరరావుకు లీగల్ నోటీసులు పంపారు. తనకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోతే కోటి రూపాయాలు దావా వేస్తానని హెచ్చరించారు.

అమరావతి: పరువు నష్టం దావా కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి,జగతి పబ్లికేషన్స్‌కు మాజీ ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్   వెంకటేశ్వరరావు లీగల్ నోటీసులు పంపారు.పరువు నష్టం దావా కేసుకు సంబంధించి ఆయన లీగల్ నోటీసులు పంపారు.  సాక్షి టీవీ ఈడీ వినయ్ మహేశ్వరి,  సాక్షి పత్రి ఎడిటర్ మురళి, గతంలో సాక్షిలో కీలకంగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి ,రామచంద్రమూర్తికి ఏబీ వెంకటేశ్వరరావు నోటీసులు పంపారు.  వీరందరికి జూలై 19న పరువు నష్టం దావా నోటీసులు పంపారు. 

2019 ఎన్నికల సమయంలో  రూ. 50 కోట్ల తరలింపునకు ఎస్కార్ట్ ఇచ్చారనే ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వరరావు పరువు నష్టం దావా వేశారు.  తనపై చేసిన ఈ ఆరోపణలకు సంబంధించి బహిరంగ క్షమాపణలు చెప్పాలని  ఆయన కోరారు. లేదంటే  కోటి రూపాయాలు పరువు నష్టం దావా వేస్తానని ఆయన ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?