24 గంటల్లో 1288 కరోనా కేసులు: ఏపీలో మొత్తం 9,04,548 చేరిక

Published : Apr 02, 2021, 06:15 PM IST
24 గంటల్లో 1288 కరోనా కేసులు: ఏపీలో మొత్తం 9,04,548 చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1288  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 04వేల 548 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1288  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 04వేల 548 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు. అనంతపురం, చిత్తూరు, గుంటూరు,ప్రకాశం, విశాఖపట్టణం జిల్లాల్లో  కరోనాతో ఒక్కొక్కరు మరణించారు.  రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,225 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,51,46,104 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 31,116 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో1288 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 610 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 88వేల 508 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 8815యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 026, చిత్తూరులో 225,తూర్పుగోదావరిలో 026,గుంటూరులో 311, కడపలో 021,కృష్ణాలో 164, కర్నూల్ లో 052,నెల్లూరులో 118,,ప్రకాశంలో 062, శ్రీకాకుళంలో 054, విశాఖపట్టణంలో 191, విజయనగరంలో 031,పశ్చిమగోదావరిలో 007కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -68,509, మరణాలు 604
చిత్తూరు  -90,311,మరణాలు 868
తూర్పుగోదావరి -1,25,389, మరణాలు 636
గుంటూరు  -78,412, మరణాలు 678
కడప  -55,902, మరణాలు 463
కృష్ణా  -50,902,మరణాలు 685
కర్నూల్  -61,691, మరణాలు 494
నెల్లూరు -63,279, మరణాలు 511
ప్రకాశం -62,680, మరణాలు 583
శ్రీకాకుళం -46,796,మరణాలు 347
విశాఖపట్టణం  -62,076,మరణాలు 576
విజయనగరం  -41,394, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,555, మరణాలు 542


 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు