ప.గోదావరిలో కరోనా ఉధృతి: ఏపీలో మొత్తం కేసులు 20,02,340కి చేరిక

Published : Aug 22, 2021, 05:07 PM IST
ప.గోదావరిలో కరోనా ఉధృతి: ఏపీలో మొత్తం కేసులు 20,02,340కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1085 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు 20,02,340 లక్షలకు చేరుకొన్నాయి. నిన్న ఒక్క రోజే 8 మంది మరణించారు.


అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో57,745 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 1085 మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,02,340 లక్షలకు చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 13,723కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 1541మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 73వేల 940 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 14,677 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,60,91,962 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో029,చిత్తూరులో 130, తూర్పుగోదావరిలో105,గుంటూరులో116,కడపలో 032, కృష్ణాలో099, కర్నూల్ లో010, నెల్లూరులో108, ప్రకాశంలో 122,విశాఖపట్టణంలో 099,శ్రీకాకుళంలో042 విజయనగరంలో 056,పశ్చిమగోదావరిలో 137 కేసులు నమోదయ్యాయి.


గత 24 గంటల్లో కరోనాతో  ఎనిమిది మంది చనిపోయారు.కృష్ణా జిల్లాలో ముగ్గురు, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, విశాఖ పట్టణం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున కరోనాతో మరణించారు. దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,723కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,56,936, మరణాలు 1091
చిత్తూరు-2,36,284, మరణాలు1813
తూర్పుగోదావరి-2,83,919, మరణాలు 1247
గుంటూరు -1,71,469,మరణాలు 1175
కడప -1,11,928, మరణాలు 629
కృష్ణా -1,12,542,మరణాలు 1281
కర్నూల్ - 1,23,682,మరణాలు 845
నెల్లూరు -1,38,842,మరణాలు 987
ప్రకాశం -1,32,628, మరణాలు 1035
శ్రీకాకుళం-1,21,687, మరణాలు 773
విశాఖపట్టణం -1,54,328, మరణాలు 1101
విజయనగరం -82,095, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,73,105, మరణాలు 1077


 

PREV
click me!

Recommended Stories

Republic Day Celebrations 2026: గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ స్పీచ్ | Asianet Telugu
Republic Day Celebrations in Amaravati: చంద్రబాబుకి పవన్ కి లోకేష్ ఘన స్వాగతం| Asianet News Telugu