కరణం రాహుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కోరాడ విజయ్ కుమార్ ఆదివారం నాడు మాచవరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు.
విజయవాడ: వ్యాపారవేత్త కరణం రాహుల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కోరాడ విజయ్ కుమార్ ఆదివారం నాడు మాచవరం పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు.
ఈ నెల 19వ తేదీన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పార్క్ చేసిన కారులో జిక్సిన్ సిలిండర్ యజమాని కరణం రాహుల్ అనుమానాస్పదస్థితిలో మరణించాడు. పార్కింగ్ చేసిన కారులో రాహుల్ డెడ్ బాడీని పరిశీలించిన తర్వాత కారులో దొరికిన వస్తువుల ఆధారంగా రాహుల్ ను హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారించారు.
undefined
also read:రాహుల్ హత్య కేసు: పంజాగుట్ట మర్డర్ తరహాలో ప్లాన్.. కోగంటి సత్యం చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు
ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రాహుల్ తో పాటు కోరాడ విజయ్ కుమార్ లు జిక్సిన్ ఫ్యాక్టరీలో భాగస్వామ్యులుగా ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య ఆర్ధిక లావాదేవీల విషయమై గొడవలున్నాయని పోలీసులు గుర్తించారు.
రాహుల్ హత్య విషయంలో పోలీసులు శాస్త్రీయమైన ఆధారాలను గుర్తించారు. ఈ కేసులో కోరాడ విజయ్ కుమార్ ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. విజయ్ కుమార్ బెంగుళూరులో ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే తన లాయర్ సహకారంతో విజయ్ కుమార్ ఇవాళ మాచవరం పోలీసులకు లొంగిపోయారు. విజయ్ కుమార్ ను పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.ఈ కేసులో ఏ1 గా కోరాడ విజయ్ కుమార్, ఏ 2 గా పద్మజ, ఏ3 గా గాయత్రి,ఏ 4 గా కోగంటి సత్యంలను పోలీసులు చేర్చారు.