గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన ఏపీపీఎస్సీ

Siva Kodati |  
Published : Jul 04, 2019, 05:26 PM IST
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించిన ఏపీపీఎస్సీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. డిసెంబర్ 12 నుంచి 23 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏడు పేపర్లుగా నిర్వహిస్తామని తెలిపింది

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. డిసెంబర్ 12 నుంచి 23 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను ఏడు పేపర్లుగా నిర్వహిస్తామని తెలిపింది. డిసెంబర్ 12, 13, 15, 17, 19, 21, 23 తేదీల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 169 గ్రూప్-1 పోస్టుల భర్తీకి మే 26న గ్రూప్-1 స్క్రీనింగ్ టెస్ట్‌ను ఏపీపీఎస్సీ నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,14,473 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోగా... వీరిలో పేపర్-1 (జనరల్ స్టడీస్)కు 59,697 మంది, పేపర్-2 (జనరల్ ఆప్టిట్యూడ్) పరీక్షకు 59,200 మంది అభ్యర్ధులు హాజరయ్యారు.

PREV
click me!

Recommended Stories

భోగాపురం ఎయిర్ పోర్ట్ లోపల ఎలా ఉందో చూడండి | Inside Bhogapuram International Airport
Bhogapuram Airport : ఆంధ్ర ప్రదేశ్ పై ప్రధాని వరాలు... కేంద్రం ఏమేం చేస్తుందో చెప్పిన నరేంద్ర మోదీ