విశాఖ జిల్లాలో గంజాయి ముఠా బీభత్సం.. పోలీసులు కారును వెంబడించడంతో..

Published : Jan 25, 2022, 12:26 PM IST
విశాఖ జిల్లాలో గంజాయి ముఠా బీభత్సం.. పోలీసులు కారును వెంబడించడంతో..

సారాంశం

విశాఖపట్నం (visakhapatnam) జిల్లా నర్సీపట్నంలో (narsipatnam) ఓ గంజాయి ముఠా హల్‌చల్ చేసింది. మహారాష్ట్రకు చెందిన ఈ గంజాయి ముఠా పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో బీభత్సం సృష్టించింది. 

విశాఖపట్నం (visakhapatnam) జిల్లా నర్సీపట్నంలో (narsipatnam) ఓ గంజాయి ముఠా హల్‌చల్ చేసింది. మహారాష్ట్రకు చెందిన ఈ గంజాయి ముఠా పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో బీభత్సం సృష్టించింది. మంగళవారం ఉదయం ఓ కారులో గంజాయి తరలిస్తున్న విషయాన్ని స్థానిక ట్రాఫిక్ ఎస్‌ఐ గుర్తించారు. దీంతో ఎస్సై ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే దీనిని గుర్తించిన వాహనంలోని గంజాయి ముఠా.. కారును మరింత వేగంగా పోనిచ్చారు. అయితే తప్పించుకునే క్రమంలో ముఠా ప్రయాణిస్తున్న కారు.. ఓ ఆటోను ఢీకొట్టింది. 

అయితే పోలీసులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా గంజాయి ముఠా కారును చేజ్ చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరు స్మగర్లు కారు వదిలేసి పక్కనే ఉన్న  పెదబొడ్డేపల్లి పెద్ద చెరువులో దూకారు. అయితే మరో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. చెరువు చుట్టూ మోహరించారు. చెరువులో దూకిన ఇద్దరు స్మగర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఆ తర్వాత పరారైన మరో స్మగ్లర్‌ను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఠా సభ్యులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు..?, ఎంత మొత్తంలో గంజాయి తరలిస్తున్నారు..? దీని వెనకాల ఎవరైనా ఉన్నారా..? అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vangalapudi Anitha: మహిళలకు 33% రిజర్వేషన్ హోమ్ మంత్రి అనిత | Asianet News Telugu
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే