గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లోకి రూ. 15 వేలు.. YSR EBC Nestham ప్రారంభించిన సీఎం జగన్..

By Sumanth KanukulaFirst Published Jan 25, 2022, 11:52 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌‌లో (Andhra Pradesh) మరో కొత్త పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham) పథకాన్ని సీఎం జగన్.. మంగళవారం ప్రారంభించారు. 

ఆంధ్రప్రదేశ్‌‌లో (Andhra Pradesh) మరో కొత్త పథకానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం (YSR EBC Nestham) పథకాన్ని సీఎం జగన్.. మంగళవారం ప్రారంభించారు. అగ్రవర్ణ పేద మహిళ మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా సీఎం జగన్ ఈ పథకాన్ని తీసుకొచ్చారు. 45 నుంచి 60 ఏళ్లలోపు అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఈ పథకం లబ్దిదారులకు ఏడాదికి రూ. 15 వేల చొప్పున మూడేళ్ల పాటు ఆర్థిక సాయం అందజేయనున్నారు. ఈ క్రమంలోనే నేడు పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్.. రాష్ట్రంలోని 3,92,674 మంది లబ్ధిదారులకు ఖాతాల్లోకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ. 589 కోట్లు కంప్యూటర్‌ బటన్‌ నొక్కి జమ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థికసాయం అందిస్తున్నామని చెప్పారు. అయితే ఇది ఎన్నికల హామీ కాదని, మేనిఫెస్టోలో చెప్పలేదని అన్నారు. అగ్రవర్ణ పేద మహిళల ఆర్థికంగా చేయూత అందించడానికే ఈ పథకాన్ని తీసుకొచ్చినట్టుగా తెలిపారు. అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారని చెప్పారు. అగవర్ణ పేద మహిళలకు మెరుగైన జీవనోపాధే ప్రభుత్వ లక్ష్యం అని తెలిపారు. 

బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, వెలమ.. తదితర ఓసీ కులాలకు ఈబీసీ నేస్తం కింద ప్రభుత్వం ఆర్థిక సాయం చేయనుందని చెప్పారు. సున్నా వడ్డీ ద్వారా పొదుపు సంఘాల మహిళలకు అండగా నిలిచామని చెప్పారు. రాజ్యంగ స్పూర్తిని అనుసరిస్తూ అడుగులు వేస్తున్నామని తెలిపారు. 

click me!