పోలీసుల తలపై మూడు సింహాలు కాదు మూడు ఫ్యాన్ రెక్కలు..: బుద్దా అరెస్ట్ పై చంద్రబాబు, యనమల ధ్వజం

Arun Kumar P   | Asianet News
Published : Jan 25, 2022, 11:08 AM IST
పోలీసుల తలపై మూడు సింహాలు కాదు మూడు ఫ్యాన్ రెక్కలు..: బుద్దా అరెస్ట్ పై చంద్రబాబు, యనమల ధ్వజం

సారాంశం

మంత్రి కొడాలి నాని, డిజిపి సవాంగ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసాడంటూ టిడిపి నేత బుద్దా వెంకన్నను అరెస్ట్ చేయడాన్ని మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు యనమల, అయ్యన్న ఖండించారు.  

విజయవాడ: మంత్రి కొడాలి నాని (kodali nani), రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ (goutham sawang) పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత బుద్దా వెంకన్న (budda venkanna)ను సోమవారం సాయంత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి నానిని చంపుతా... రక్తం కళ్ళ చూస్తా అన్నాడంటూ బుద్దాపై వైసిపి (ysrcp) నాయకులు ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 153A, 506, 505(2), రెడ్ విత్ 34 సెక్షన్ల కింద వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదుచేసారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం తీవ్ర గందరగోళం మధ్యం బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేసారు. 

అయితే వెంకన్న అరెస్ట్ ను టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu)తో పాటు సీనియర్లు అయ్యన్నపాత్రుడు (ayyannapatrudu), యనమల రామకృష్ఱుడు (yanamala ramakrishnudu) ఖండించారు. గుడివాడ (gudivada)లో మంత్రి కొడాలి క్యాసినో (casino) పై ప్రశ్నించాడని బుద్దా వెంకన్నను  అరెస్టు చేస్తారా అంటూ చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్య దుర్మార్గంగా ఉందన్నారు. క్యాసినోపై వాస్తవాలు వెల్లడించలేని పోలీసులు టిడిపి నేతలను అరెస్టు చెయ్యడం దారుణమని చంద్రబాబు అన్నారు. 

''వైసిపి ప్రభుత్వ చర్యలతో వారి తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. .గుడివాడలో ఏమీ జరగకపోతే ప్రభుత్వం, పోలీసులు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు. మాపై దాడి చేసిన వారిని వదిలేసి....నిలదీసిన ప్రతిపక్ష నేతలను అరెస్టు చెయ్యడం సిగ్గుమాలిన చర్య'' అని చంద్రబాబు మండిపడ్డారు. 

''బుద్దా వెంకన్నపై పెట్టిన కేసు పూర్తిగా కుట్రపూరితం. కాబట్టి వెంకన్నను వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నా. తప్పుల మీద తప్పులు చేస్తున్న పోలీసులు భవిష్యత్ లో విచారణ ఎదుర్కోక తప్పదు'' అని చంద్రబాబు హెచ్చరించారు. 

ఇక బుద్దా అరెస్ట్ పై మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కూడా స్పందించారు. సీఎం జగన్ రెడ్డి ఓ వైపు వైసీపీ రౌడీలను అడ్డుపెట్టుకుని ప్రజల్ని, మరో వైపు పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతల్ని హింసిస్తున్నారని అన్నారు.  వైసీపీ అరాచక పాలనకు పోలీసులు వత్తాసు పలకడం దుర్మార్గమన్నారు. టీడీపి నేత బుద్దా అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని యనమల పేర్కొన్నారు. 

''సమాజంలో అల్లర్లు సృష్టిస్తూ అరాచకాలు చేస్తున్న వైసీపీ గుండాలను వదలి టీడీపీ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. టీడీపీ కార్యకర్తల్నివైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి కొడాలి నాని...కొంతమంది  వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టేలా, సభ్యసమాజం తలదించుకునేలా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.  వారిపై ఏం చర్యలు తీసుకున్నారు? 3 ఏళ్లలో ఎంతమంది వైసీపీ నేతల్ని అరెస్ట్ చేసారు?  పోలీసులు తమ నెత్తి మీద 3 సింహాలకు బదులు 3 ఫ్యాన్ రెక్కలు పెట్టుకోండి'' అంటూ ఎద్దేవా చేసారు. 

''ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చెప్పినట్టు విని రాష్ట్ర డిజిపి సవాంగ్, డిజిపి చెప్పినట్టు విని కొంతమంది పోలీసులు వారి భవిష్యత్ ను వారే అంధకారంలోకి నెట్టుకుంటున్నారు. కాబట్టి పోలీసులు ఉన్నతాధికారులు చెప్పినట్లు కాకుండా చట్టానికి లోబడి పనిచేయాలి'' అని యనమల డిమాండ్ చేసారు.

బుద్దా వెంకన్న అరెస్టును ఖండిస్తూ టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేసారు. ''జగన్ రెడ్డి కుల అహంకార ధోరణికి బుద్దా వెంకన్న అరెస్ట్ ఒక ఉదాహరణ. బూతులు తిట్టిన నానిని వదిలేసి బీసీ నేత అయిన బుద్దా వెంకన్న ని అరెస్ట్ చెయ్యడంతోనే బీసీలను జగన్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని అర్ధమైంది. బీసీ నాయకత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహారిస్తున్న జగన్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో బీసీలు భూస్థాపితం చెయ్యడం ఖాయం''  అని అయ్యన్న హెచ్చరించారు. 


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: నారావారిపల్లెలో అభివృద్ధిపనులు ప్రారంభించిన సీఎం| Asianet News Telugu
Bhumana Karunakar Reddy: కోనసీమ జిల్లాలో బ్లోఔట్ పై భూమన సంచలన కామెంట్స్ | Asianet News Telugu