ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కరోనా..

Published : Feb 01, 2022, 01:11 PM IST
ఏపీ సినిమాటోగ్రఫీ  మంత్రి పేర్ని నానికి కరోనా..

సారాంశం

ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి perni naniకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు పీఆర్సీపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో సమావేశం కానున్నారు. 

ఆంధ్రప్రదేశ్ : కరోనా మహమ్మారి తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా corona cases రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. Omicron variant వెలుగులోకి రాకముందు కరోనా కేలుసు bharatలో తగ్గుముఖం పట్టిన విషయంతెలిసిందే. అయితే భారత్ లో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతున్న నేపత్యంలో కరోనా కేసులు కూడా భారీగా నమోదవుతున్నాయి. అయితే కరోనా సెకండ్ వేవ్ లో వ్యాప్తి చెందిన డెల్టా వేరియంట్ కంటే.... థర్డ్ వేవ్ లో వ్యాప్తి చేందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా ఉంది. దీంతో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. 75 శాతం వ్యాక్సినేషన్ జరిగిన ఫ్రాన్స్ వంటి దేశాల్లో కరోనా బీభత్ం సృష్టిస్తోంది. 

అయితే ఏపీలో కూడా ఒమిక్రాన్ ప్రభావం అధికంగానే ఉంది. దీంతో రోజు 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదువుతున్నాయి. ఇదిలా ఉంటే.. ఏపీ మంత్రులు కరోనా బారిన పడుతున్నారు. మంత్రి కొడాలి నానితో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి perni naniకి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆయన వైద్యుల సూచన మేరకు ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ రోజు పీఆర్సీపై చర్చించేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సచివాలయంలో సమావేశం కానున్నారు. కరోనా సోకడంతో మంత్రి పేర్ని నాని ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చేతుల మీద కర్పూరం వెలిగించి హారతి ఇచ్చిన మహిళ | CBN Full Speech At House Pattas Distribution
మహిళ స్పీచ్ కి దండంపెట్టేసిన బాబు | Chandrababu Giving House Pattas To Beneficiaries