
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ప్రభుత్వం తుది గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తం 26 జిల్లాలు, 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ప్రతీ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్లను, జిల్లా కేంద్రాన్ని పేర్కొంటూ వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇచ్చారు. ఏప్రిల్ 4 నుంచి కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. 2011 లెక్కల ప్రకారం సగటున జిల్లాకు 18 నుంచి 20 లక్షల జనాభా ఉండేలా ప్రభుత్వం. జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది.
ఏపీలో కొత్తగా 26 జిల్లాలను ప్రతిపాదిస్తూ ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్లు జారీచేసింది. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని జిల్లాలను విభజించింది. ఈ ప్రకారం.. 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ.. విస్తీర్ణం దృష్ట్యా అరకు లోక్‌సభ నియోజకవర్గాన్ని మాత్రం రెండు జిల్లాలుగా విభజించింది. దీంతో మొత్తం 26 జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై మార్చి 7వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలు స్వీకరించింది. కొత్త జిల్లాల ప్రతిపాదనలపై రాష్ట్ర వ్యాప్తంగా 284 అంశాలపై ప్రజల నుంచి 17,500కు పైగా సూచనలు వచ్చినట్టుగా తెలిసింది.
ఈ క్రమంలోనే వాటిపై సమీక్షించిన ప్రభుత్వం.. స్వల్ప మార్పులతో కొత్త జిల్లాలను ఖరారు చేసింది. ప్రాథమిక నోటిఫికేషన్‌లో ప్రతిపాదించిన మేరకు కొత్త జిల్లాల పేర్లను ప్రభుత్వం దాదాపు అలాగే ఉంచింది. తిరుపతి కేంద్రంగా ప్రతిపాదించిన బాలాజీ జిల్లాను మాత్రం అక్కడి ప్రజల కోరిక మేరకు తిరుపతి జిల్లాగా పేరు మార్చింది. మన్యం జిల్లాకు బదులుగా పార్వతీపురం మన్యం అనే పేరు ఖరారు చేశారు. జిల్లాకు కనీసం రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసింది. 10 జిల్లాల్లో రెండు, 12 జిల్లాల్లో మూడు, నాలుగు జిల్లాల్లో 4 చొప్పున మొత్తం 72 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు.
ఇక, ప్రాథమిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న కొన్ని జిల్లాల పరిధిలోని మండలాల్లో కొన్ని సవరణలు జరిగాయి. ప్రతిపాదించిన కొన్ని మండలాలు అటు ఇటు మారాయి. సాధ్యమైనంత వరకు ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒకే జిల్లాలోకి తెచ్చేలా చర్యలు తీసుకున్నారు.. ఇలా చేయడం వల్ల స్థానికంగా ఇబ్బందులు ఉన్నచోట ఆ మండలాలను మార్చింది.
1. శ్రీకాకుళం జిల్లా
జిల్లా కేంద్రం : శ్రీకాకుళం
మొత్తం మండలాలు: 30
రెవెన్యూ డివిజన్లు: పలాస (కొత్త), టెక్కలి, శ్రీకాకుళం,
2. విజయనగరం జిల్లా
జిల్లా కేంద్రం: విజయనగరం
మొత్తం మండలాలు: 27
రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి (కొత్త), చీపురుపల్లి (కొత్త), విజయనగరం
3. పార్వతీపురం మన్యం జిల్లా
జిల్లా కేంద్రం: పార్వతీపురం
మొత్తం మండలాలు: 14
రెవెన్యూ డివిజన్లు: పాలకొండ, పార్వతీపురం
4. అల్లూరి సీతారామరాజు జిల్లా
జిల్లా కేంద్రం: పాడేరు
మండలాలు: 22
రెవెన్యూ డివిజన్లు: పాడేరు, రంపచోడవరం
5. విశాఖపట్నం జిల్లా
జిల్లా కేంద్రం: విశాఖపట్నం
మొత్తం మండలాలు: 11
రెవెన్యూ డివిజన్లు: భీమునిపట్నం(కొత్త), విశాఖపట్నం
6. అనకాపల్లి జిల్లా
జిల్లా కేంద్రం: అనకాపల్లి
మొత్తం మండలాలు: 24
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం, అనకాపల్లి
7. కాకినాడ జిల్లా
జిల్లా కేంద్రం: కాకినాడ
మొత్తం మండలాలు: 21
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం, కాకినాడ
8. కోనసీమ జిల్లా
జిల్లా కేంద్రం: అమలాపురం
మొత్తం మండలాలు: 22
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం, అమలాపురం
9. తూర్పు గోదావరి జిల్లా
జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
మొత్తం మండలాలు: 19
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం, కొవ్వూరు
10. పశ్చిమ గోదావరి జిల్లా
జిల్లా కేంద్రం: భీమవరం
మొత్తం మండలాలు: 19
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం, భీమవరం (కొత్త)
11. ఏలూరు జిల్లా
జిల్లా కేంద్రం: ఏలూరు
మొత్తం మండలాలు: 28
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు
12. కృష్ణా జిల్లా
కేంద్రం: మచిలీపట్నం
మొత్తం మండలాలు: 25
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు(కొత్త)
13. ఎన్టీఆర్ జిల్లా
జిల్లా కేంద్రం: విజయవాడ
మొత్తం మండలాలు: 20
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ, నందిగామ (కొత్త), తిరువూరు (కొత్త)
14. గుంటూరు జిల్లా
జిల్లా కేంద్రం: గుంటూరు
మొత్తం మండలాలు: 18
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు, తెనాలి
15. బాపట్ల జిల్లా
జిల్లా కేంద్రం: బాపట్ల
మొత్తం మండలాలు: 25
రెవెన్యూ డివిజన్లు : బాపట్ల (కొత్త), చీరాల (కొత్త)
16. పల్నాడు జిల్లా
జిల్లా కేంద్రం: నరసరావుపేట
మొత్తం మండలాలు: 28
రెవెన్యూ డివిజన్లు: గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి (కొత్త)
17. ప్రకాశం జిల్లా
జిల్లా కేంద్రం: ఒంగోలు
మొత్తం మండలాలు: 38
రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం, ఒంగోలు, కనిగిరి (కొత్త)
18. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
జిల్లా కేంద్రం: నెల్లూరు
మొత్తం మండలాలు: 38
రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు , ఆత్మకూరు, కావలి, కందుకూరు
19. కర్నూలు జిల్లా
జిల్లా కేంద్రం: కర్నూలు
మొత్తం మండలాలు: 26
రెవెన్యూ డివిజన్లు : కర్నూలు, ఆదోని, పత్తికొండ (కొత్త)
20. నంద్యాల జిల్లా
జిల్లా కేంద్రం: నంద్యాల
మొత్తం మండలాలు: 29
రెవెన్యూ డివిజన్లు : నంద్యాల, డోన్ (కొత్త), ఆత్మకూరు (కొత్త)
21. అనంతపురం జిల్లా
జిల్లా కేంద్రం: అనంతపురం
మొత్తం మండలాలు: 31
రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం, అనంతపురం, గుంతకల్ (కొత్త)
22. శ్రీ సత్యసాయి జిల్లా
జిల్లా కేంద్రం: పుట్టపర్తి
మొత్తం మండలాలు: 32
రెవెన్యూ డివిజన్లు : ధర్మవరం, పెనుగొండ, పుట్టపర్తి (కొత్త), కదిరి
23. వైఎస్సార్ కడప జిల్లా
జిల్లా కేంద్రం: కడప
మొత్తం మండలాలు 36
రెవెన్యూ డివిజన్లు : కడప, జమ్మలమడుగు, బద్వేలు
24. అన్నమయ్య జిల్లా
జిల్లా కేంద్రం: రాయచోటి
మొత్తం మండలాలు: 30
రెవెన్యూ డివిజన్లు : రాజంపేట, రాయచోటి(కొత్త), మదనపల్లి
25. చిత్తూరు జిల్లా
జిల్లా కేంద్రం: చిత్తూరు
మొత్తం మండలాలు: 31
రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు, పలమనేరు (కొత్త), కుప్పం (కొత్త), నగరి (కొత్త)
26. తిరుపతి జిల్లా
జిల్లా కేంద్రం: తిరుపతి
మొత్తం మండలాలు: 34
రెవెన్యూ డివిజన్లు : సూళ్లూరుపేట, గూడూరు, తిరుపతి, శ్రీకాళహస్తి (కొత్త)
ఈ క్రమంలోనే కొత్త జిల్లాలకు ఐఎఎస్, ఐపిఎస్ లను కేటాయించడంతో పాటు పాత జిల్లాల్లో సర్దుబాటు చేసారు. ఇలా అన్ని జిల్లాల్లో కీలకమైన కలెక్టర్లు, ఎస్పీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
జిల్లాల వారిగా కలెక్టర్ల వివరాలు:
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా శ్రీకేశ్ బాలాజీరావు
విజయనగరం జిల్లా కలెక్టర్‌గా సూర్యకుమారి
పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా నిశాంత్ కుమార్
విశాఖ జిల్లా కలెక్టర్‌గా మల్లికార్జున
అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా సుమిత్ కుమార్
అనకాపల్లి జిల్లా కలెక్టర్‌గా రవి సుభాష్
కాకినాడ జిల్లా కలెక్టర్‌గా కృతికా శుక్లా
తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌గా మాధవీలత
కోనసీమ జిల్లా కలెక్టర్‌గా హిమాన్షు శుక్లా
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా పి.ప్రశాంతి
ఏలూరు జిల్లా కలెక్టర్‌గా ప్రసన్న వెంకటేశ్
కృష్ణా జిల్లా కలెక్టర్‌గా రంజిత్ బాషా
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గా దిల్లీరావు
గుంటూరు జిల్లా కలెక్టర్ గా వేణుగోపాల్ రెడ్డి
పల్నాడు జిల్లా కలెక్టర్ గా శివశంకర్
బాపట్ల కలెక్టర్ గా విజయ
ప్రకాశం జిల్లా కలెక్టర్ గా దినేశ్ కుమార్
ఎస్‌పీఎస్ నెల్లూరు జిల్లా కలెక్టర్ గా చక్రధర్ బాబు
తిరుపతి జిల్లా కలెక్టర్ గా వెంకటరమణా రెడ్డి
చిత్తూరు జిల్లా కలెక్టర్ గా హరినారాయణ
అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా శ్రీ గిరీష
వైఎస్సార్ కడప కలెక్టర్ గా విజయరామారావు
శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్‌గా పి.బసంత్ కుమార్
అనంతపురం కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మి
నంద్యాల కలెక్టర్‌గా మనజీర్ జిలాని శామూన్
కర్నూలు జిల్లా కలెక్టర్‌గా కోటేశ్వరరావు
జిల్లాల వారిగా ఎస్పీలు, కమీషనర్ల వివరాలు:
విశాఖ జిల్లా కమిషనర్‌గా సీహెచ్. శ్రీకాంత్
శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా జి.ఆర్.రాధిక
విజయనగరం జిల్లా ఎస్పీగా ఎం.దీపిక
పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా వాసన విద్య సాగర్ నాయుడు
అనకాపల్లి జిల్లా ఎస్పీగా గౌతమి సాలి
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీగా సతీశ్‌కుమార్
కాకినాడ జిల్లా ఎస్పీగా రవీంద్రనాథ్‌బాబు
కోనసీమ జిల్లా ఎస్పీగా కె.ఎస్.ఎస్.వి. సుబ్బారెడ్డి
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగి
పశ్చిమ గోదావరి జిల్లాగా ఎస్పీగా రవిప్రకాశ్
ఏలూరు జిల్లా ఎస్పీగా ఆర్.ఎన్.అమ్మిరెడ్డి
కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్
విజయవాడ కమిషనర్‌గా క్రాంతి రాణా టాటా
గుంటూరు జిల్లా ఆర్బన్ ఎస్పీగా కె.ఆరీఫ్ హాఫీజ్
పల్నాడు జిల్లా ఎస్పీగా రవిశంకర్‌రెడ్డి
బాపట్ల జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్
ప్రకాశం జిల్లా ఎస్పీగా మల్లిక గార్గ్ కొనసాగింపు
ఎస్‌పీఎస్ నెల్లూరు జిల్లా ఎస్పీగా సీహెచ్ విజయరావు కొనసాగింపు
తిరుపతి జిల్లా ఎస్పీగా పరమేశ్వర్‌రెడ్డి
చిత్తూరు జిల్లా ఎస్పీగా రిశాంత్‌రెడ్డి
అన్నమయ్య జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు
వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీగా అన్బూరాజన్ కొనసాగింపు
అనంతపురం జిల్లా ఎస్పీగా ఫకీరప్ప కొనసాగింపు
శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీగా రాజుల్ దేవ్ సింగ్
కర్నూలు జిల్లా ఎస్పీగా సుధీర్‌కుమార్‌రెడ్డి
నంద్యాల జిల్లా ఎస్పీగా కె.రఘువీరారెడ్డి