ఏపీలో కరోనా వ్యాక్సిన్ కొరత: టీకా ఉత్సవ్ వాయిదా

By narsimha lodeFirst Published Apr 11, 2021, 11:22 AM IST
Highlights

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డోసులు తక్కువగా ఉండడంతో విశాఖపట్టణం సహా కొన్ని జిల్లాల్లో టీకా ఉత్సవ్ కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ డోసులు తక్కువగా ఉండడంతో విశాఖపట్టణం సహా కొన్ని జిల్లాల్లో టీకా ఉత్సవ్ కార్యక్రమాన్ని అధికారులు వాయిదా వేశారు.రాష్ట్రంలో కరోనా టీకాల డోసులు తక్కువగా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు.  రాష్ట్రంలో సుమారు 1 లక్ష డోసులు మాత్రమే నిల్వ ఉన్నట్టుగా వైద్య శాఖాధికారులు తెలిపారు.విశాఖపట్టణంలో అత్యల్పంగా 500 డోసులు మాత్రమే ఉన్నాయి. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 32 వేల కరోనా డోసులున్నాయని అధికారులు తెలిపారు. 

ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రానికి ఆయా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద కరోనా వ్యాక్సిన్ లేదని అధికారులు నో స్టాక్ బోర్డులు పెట్టే అవకాశం ఉందని అధికారులు ఆందోళనతో ఉన్నారు.రాష్ట్రానికి అవసమరైన టీకా వ్యాక్సిన్ పంపాలని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులకు రాష్ట్రం నుండి సమాచారం పంపారు.ఈ నెల 1వ తేదీ నుండి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను సీఎం జగన్ ప్రారంభించారు. టీకా ఉత్సవ్ కార్యక్రమంలో రాష్ట్రంలో 6 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

also read:ఇండియాలో కరోనా కల్లోలం: ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కేసులు, మరణాల నమోదు

వ్యాక్సినేషన్ ను సకాలంలో అందించకపోతే రెండోడోసు తీసుకొనేవారికి వ్యాక్సిన్ అందుబాటులో ఉండకపోవచ్చని  అధికారులు తెలిపారు.రాష్ట్రంలో ఇప్పటివరకు 39 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు.రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అందించిన వివరాల మేరకు ఏప్రిల్ 6వ తేదీ నాటికి  రాష్ట్రంలో కోవాగ్జిన్1.38 లక్షలు, 3.06 లక్షలు కోవిషీల్డ్ డోసులున్నాయి. 

శనివారం నాటికి సుమారు 2 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి సమాచారం అందింది. వచ్చే వారంలో మరికొన్ని డోసులు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.నిర్ణీత షెడ్యూలు ప్రకారం వ్యాక్సిన్ అందకపోవడంతో వ్యాక్సిన్ కోసం అధికారులు ఆందోళన చెందుతున్నారు. 


 
 

click me!