ఆంధ్రప్రదేశ్‌లో టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల: మార్చిలోనే ఎగ్జామ్స్

By narsimha lodeFirst Published Dec 14, 2023, 3:40 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను  ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది.  వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  ఎన్నికలకు ముందే పరీక్షలను నిర్వహించనున్నారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  2024 మార్చి మాసంలో  టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు.

గురువారంనాడు  విజయవాడలో  మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.2024 మార్చి 18 నుండి 30వ తేదీ వరకు   టెన్త్ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా మంత్రి వివరించారు. అదే విధంగా మార్చి  1 నుండి  15వ తేదీ వరకు  ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.వచ్చే ఏడాది ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందే  టెన్త్, ఇంటర్ పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  మార్చి మాసంలోనే  పరీక్షలను నిర్వహించనున్నారు. 

వచ్చే ఏడాది ఏప్రిల్ మాసంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందే  టెన్త్, ఇంటర్ పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  మార్చి మాసంలోనే  పరీక్షలను నిర్వహించనున్నారు. 

టెన్త్ క్లాస్ పరీక్షల టైమ్ టైబుల్


మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్
మార్చి 20న ఇంగ్లీష్,
మార్చి 22న గణితం
 మార్చి 23న ఫిజికల్ సైన్స్
మార్చి 26న బయాలజీ
మార్చి 27న సోషల్ స్టడీస్

టెన్త్ పరీక్షలను ఉదయం  09:30 గంటల నుండి మధ్యాహ్నం  12:45 గంటల వరకు నిర్వహించనున్నారు.టెన్త్, ఇంటర్ పరీక్షలకు సంబంధించి 16 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారని మంత్రి  బొత్స సత్యనారాయణ చెప్పారు.ఆరు లక్షల మంది  టెన్త్ క్లాస్ పరీక్షలకు హాజరుకానున్నారని మంత్రి వివరించారు.

ఇంటర్ పరీక్షల షెడ్యూల్

ఇంటర్ ఫస్టియర్


మార్చి 1న  సెకండ్ లాంగ్వేజ్
మార్చి 4న ఇంగ్లీష్ 
మార్చి 6న గణితం 1-ఏ, బోటనీ -1, సివిక్స్-1
మార్చి9న గణితం 1-బీ, జువాలజీ -1, హిస్టరీ-1
మార్చి 12న ఫిజిక్స్-1,ఎకనామిక్స్-1,
మార్చి 14న కెమిస్ట్రీ-1, కామర్స్ -1, సోషయాలజీ -1, ఫైన్ ఆర్ట్స్,మ్యూజిక్ -1,
మార్చి 16న  పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, లాజిక్ పేపర్-1, బ్రిడ్జి కోర్సు లెక్కలు-1
మార్చి 19న మోడర్న్ లాంగ్వేజ్-4,జాగ్రఫీ -1

ఇంటర్ సెకండియర్ షెడ్యూల్

మార్చి 2న సెకండ్ లాంగ్వేజ్ -2
మార్చి5న ఇంగ్లీష్ -2
మార్చి 7న గణితం -2, బోటనీ -2, సివిక్స్ -2
మార్చి 11న గణితం పేపర్ -2బీ, జువాలజీ-2, హిస్టరీ-2
మార్చి 13న ఫిజిక్స్-2, ఎకనామిక్స్ -2
మార్చి 15న కెమిస్ట్రీ -2, కామర్స్ -2, సోషయాలజీ-2, ఫైన్ ఆర్ట్స్ ,మ్యూజిక్ పేపర్ -2
మార్చి 18న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ -2, లాజిక్ పేపర్ -2, బ్రిడ్జి కోర్సు లెక్కలు -2
మార్చి 20న మోడర్న్ లాంగ్వేజ్-2, జాగఫ్రీ-2

 

click me!