విశాఖలో తప్పిన ప్రమాదం: ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం, రోగులు సురక్షితం

By narsimha lodeFirst Published Dec 14, 2023, 12:38 PM IST
Highlights


విశాఖపట్టణంలోని జగదాంబ సెంటర్ లోని ఇండస్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.


విశాఖపట్టణం: విశాఖపట్టణంలోని ఇండస్ ఆసుపత్రిలో  గురువారంనాడు  అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.దీంతో ఈ ఆసుపత్రిలోని రోగులను  అగ్నిమాపక సిబ్బంది  సురక్షితంగా  బయటకు తీసుకువచ్చారు. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో మంటలు వ్యాపించాయి. ఈ మంటలు ఇతర గదులకు  వ్యాపించాయి.ఈ విషయాన్ని గుర్తించిన   ఆసుపత్రి సిబ్బంది  వెంటనే  అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది  ఆసుపత్రిలోని రోగులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు.ఆసుపత్రిలోని రోగులను సమీపంలోని మరో ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా  ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులు ఇబ్బంది పడ్డారని రోగుల బంధువులు చెబుతున్నారు.  ఆసుపత్రిలో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై  అధికారులు ఆరా తీస్తున్నారు.  

ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్ లో నైట్రస్ ఆక్సైడ్  కారణంగా మంటలు వ్యాపించినట్టుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.  జగదాంబ సెంటర్ లోని ఇండస్ ఆసుపత్రిలో  అగ్ని ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అధికారులు  ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. 

విశాఖపట్టణంలోని జగదాంబ సెంటర్‌లో గల ఇండస్ ఆసుపత్రిలో ఇవాళ అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదం కారణంగా  ఆసుపత్రిలోని రోగులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. ఆసుపత్రిలోని  47 మందిని సురక్షితంగా  బయటకు తీసుకు వచ్చినట్టుగా విశాఖపట్టణం పోలీసులు చెబుతున్నారు.  ఆసుపత్రి అద్దాలను బద్దలు కొట్టి  రోగులను బయటకు తీసుకువచ్చామన్నారు. ఆసుపత్రిలో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై  అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

దట్టమైన పొగ, మంటల కారణంగా ఆసుపత్రిలో రోగులు,సిబ్బంది ఇబ్బంది పడ్డారు.  ఆసుపత్రిలో ఇంకా ఎవరైనా ఈ ప్రమాదంలో చిక్కుకున్నారా అనే విషయమై అధికారులు  ఆరా తీస్తున్నారు.

click me!