ఒంటరి మహిళతో హాస్పిటల్ అటెండర్ సన్నిహిత సంబంధం.. ఆమె ఇంటికి వెళ్లిన అటెండర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Published : Aug 13, 2022, 05:19 PM IST
ఒంటరి మహిళతో హాస్పిటల్ అటెండర్ సన్నిహిత సంబంధం.. ఆమె ఇంటికి వెళ్లిన అటెండర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లాలో వెటర్నరీ హాస్పిటల్‌లో అటెండర్‌గా పని చేస్తున్న శ్రీనివాసులు కొంత కాలంగా ఓ మహిళతో సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఆమె హాస్పిటల్ సమీపంలో ఒంటరిగా నివసిస్తున్నారు. ఒక రోజు ఆమె ఇంటికి వెళ్లిన శ్రీనివాసులు ఉరితాడుకు వేలాడుతూ కనిపించారు.  

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లో అనూహ్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వెటర్నరీ హాస్పిటల్‌లో అటెండర్‌గా ఉంటున్న వ్యక్తి.. సమీపంలో నివాసం ఉంటున్న ఒంటరి మహిళతో సన్నిహిత సంబంధం ఏర్పరుచుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత ఆ మహిళ ఇంటికి సదరు అటెండర్ వెళ్లాడు. కానీ, ఆ తర్వాత ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఆ ఒంటరి మహిళ ఇంటికి వెళ్లిన వెటర్నరీ హాస్పిటల్ అటెండర్ ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. 

40 ఏళ్ల శ్రీనివాసులు.. సీఎస్ పురం మండలం అంబవరం గ్రామస్తుడు. అదే సీఎస్ పురం మండలానికి చెందిన మహిళతో శ్రీనివాసులుకు సన్నిహిత సంబంధం ఏర్పడింది. ఆమె శెట్టిగుంట రోడ్డులోని వైటీ నాయుడు వీధికి సమీపంలో ఓ ఇంటిలో ఒంటరిగా నివసిస్తున్నది. కొంతకాలంగా వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారు. ఓ సారి ఆయన ఆ మహిళ ఇంటికి వెళ్లారు. మళ్లీ తిరిగి రాలేదు. శ్రీనివాసులు ఆ ఇంటిలోనే విగతజీవిగా కనిపించారు. ఆ మహిళ ఇంట్లో శ్రీనివాసులు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కనిపించారు. 

దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆ సమయంలో తాను బయటకు వెళ్లారని సదరు మహిళ పోలీసులకు తెలిపింది. తాను బయటకు వెళ్లిన సమయంలో శ్రీనివాసులు తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నారని వివరించింది. 

శ్రీనివాసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. శ్రీనివాసులు మరణించిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. శ్రీనివాసులు మరణించిన ఇంటిలో నివసిస్తున్న ఆ మహిళను పోలీసులు ఇంకా విచారిస్తున్నట్టు తెలిసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
🤣😂 YS Jagan గులకరాయి డ్రామా | Nara Lokesh Hilarious Speech On YS Jagan | Asianet News Telugu