రోడ్లపై మనుషులు చనిపోతుంటే ప్రభుత్వం నిద్రపోతోందా?.. వైసీపీ సర్కార్‌పై చంద్రబాబు ఫైర్

Published : Aug 13, 2022, 04:10 PM IST
రోడ్లపై మనుషులు చనిపోతుంటే ప్రభుత్వం నిద్రపోతోందా?.. వైసీపీ సర్కార్‌పై చంద్రబాబు ఫైర్

సారాంశం

వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై గుంత కారణంగా మనిషి చనిపోయేంత వరకు ప్రభుత్వం నిద్రపోతుందా అని ప్రశ్నించారు. 

వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై గుంత కారణంగా మనిషి చనిపోయేంత వరకు ప్రభుత్వం నిద్రపోతుందా అని ప్రశ్నించారు. మనిషి చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం మేలుకోక పోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. రోడ్డుపై గుంత కారణంగా విశాఖలో ఓ వ్యక్తి చనిపోయారని చెప్పారు. అతడు చనిపోయిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించి.. గుంతను పూడ్చకపోవడంతో అతడి కుటుంబ సభ్యులే గుంతను పూడ్చారని అన్నారు. 

‘‘ఈ నెల 4వ తారీఖున విశాఖపట్నంకు చెందిన రవ్వా సుబ్బారావు గారు రోడ్డుపై గుంత కారణంగా మరణించారు.తిరిగి అదే గుంత వద్ద 6వ తేదీన మళ్ళీ ప్రమాదం జరిగి మరో వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు. అయినా ప్రభుత్వానికి స్పృహ రాలేదు. చివరికి తమకు కలిగిన బాధ మరెవరికీ కలగకూడదని సుబ్బారావుగారి కుటుంబసభ్యులే గుంతను పూడ్చారు. ఈ నేతలకు అధికారమిచ్చి, పన్నుల రూపంలో వీళ్ళ చేతికి డబ్బులిచ్చి, చివరికి వాళ్ళు చేయాల్సిన పనిని కూడా మనమే చేసుకోవాల్సి రావడం బాధాకరం’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

YS Jagan Review Meeting with YSRCP Regional Coordinators | వై ఎస్ జగన్ కీలక సమావేశం | Asianet Telugu
స్థానిక ఎన్నికల పోరుకు సిద్ధం పూనకాలు తెపించే జగన్ స్పీచ్ | Asianet News Telugu