యనమల, చినరాజప్పలకు హైకోర్టులో ఊరట: అరెస్ట్ చేయొద్దన్న ఏపీ హైకోర్టు

By narsimha lodeFirst Published Jun 23, 2020, 2:28 PM IST
Highlights

మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన రాజప్పకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.  ఈ కేసులో ఏ1 మినహా ఎవరిని కూడ అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.

అమరావతి: మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన రాజప్పకు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది.  ఈ కేసులో ఏ1 మినహా ఎవరిని కూడ అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది.

టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి కొడుకు పెళ్లికి హాజరైన నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడులతో పాటు పలువురిపై కేసు నమోదైంది. 

తన భర్తకు  రెండో పెళ్లి చేస్తున్నారని కొందరు బెదిరించారని ఓ యువతి  తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గంలోని తొండంగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.. మాజీ ఎమ్మెల్యే  అనంతలక్ష్మి కొడుకు రాధాకృష్ణ తనను పెళ్లి చేసుకొన్నాడని ఆ యువతి ఆ ఫిర్యాదులో తెలిపింది. 

also read:అయ్యన్నకు ఊరట: అరెస్ట్ చేయొద్దని ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

 2011లో తనను రాధాకృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకొన్నట్టుగా యువతి చెబుతోంది. తనను కాదని మరో యువతితో పెళ్లి చేసే ప్రయత్నం చేయడంతో  ఆమె పోలీసులను ఆశ్రయించింది.ఏడుగురిపై  ఈ నెల 13వ తేదీన కేసు నమోదైంది

ఈ కేసులో తమను అరెస్ట్ చేయొద్దంటూ మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్పను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టు మంగళవారం నాడు ఆదేశించింది. 
మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి, ఆమె భర్తపై నమోదైన కేసులో కూడ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ప్రొసిడింగ్స్ పై కూడ హైకోర్టు స్టే విధించింది. 

click me!