మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు హైకోర్టు నోటీసులు

By narsimha lodeFirst Published Nov 26, 2019, 12:00 PM IST
Highlights

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి దేవినేిని ఉమా మహేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.


విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఫిర్యాదుపై  కోర్టు ఈ నోటీసులు జారీ చేసింది.

 కృష్ణా జిల్లా మైలవరం వైకాపా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ఎన్నికను సవాలు చేస్తూ తెదేపా అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు దాఖలు చేసిన ఎన్నికల వాజ్యంపై  హైకోర్టు స్పందిస్తూ ఈ నోటీసులు జారీ చేసింది.

 ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తో పాటు రిటర్నింగ్ అధికారి తదితరులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం. గంగారావు ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.

Also read:కరెన్సీ నోట్లను చించి పంచారు: వైసీపీపై దేవినేని ఉమ సంచలనం

వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌పై ఇటీవలనే మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్నికల సమయంలో వైసీపీకి చెందిన క్యాడర్ ఓటర్లను చించిన కరెన్సీని పంచిపెట్టినట్టుగా ఆయన విమర్శలు చేశారు. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు.ఆర్బీఐ కూడ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నుండి విజయం సాధించిన అచ్చెన్నాయుడు,  గంటా శ్రీనివాస రావుతో పాటు పలు కీలక ఎమ్మెల్యేలపై ఓటమి పాలైన వైసీపీ అభ్యర్ధులు హైకోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

click me!