గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు: ఏపీ హైకోర్టు కీలక తీర్పు

By narsimha lode  |  First Published Mar 13, 2024, 1:22 PM IST

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  ఇవాళ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి  కీలక తీర్పును వెల్లడించింది.
 


అమరావతి: ఏపీపీఎస్‌‌సీ 2018లో నిర్వహించిన  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  రద్దు చేసింది. ఈ మేరకు  ఏపీ హైకోర్టు బుధవారం నాడు కీలక తీర్పును వెల్లడించింది.

also read:గీతాంజలి మృతిపై రాజకీయరంగు: టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ మాటల యుద్ధం, ఎవరి వాదన వారిదే...

Latest Videos

undefined

గ్రూప్-1 పరీక్షలపై కొందరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దరిమిలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం నాడు కీలక తీర్పును వెల్లడించింది.గ్రూప్-1 పరీక్ష పేపర్ల మూల్యాంకనం విషయంలో  కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

also read:వెరైటీ పెళ్లి పత్రిక: విత్తనాలను పంచుతున్న ఆదిలాబాద్ వాసి

జవాబు పత్రాలను  ఒకటి కంటే ఎక్కువ దఫాలు  మూల్యాంకనం చేయడాన్ని చట్టవిరుద్దమని  హైకోర్టు పేర్కొంది.  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేయాలని  ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మరో వైపు  పరీక్ష నిర్వహణ,అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను  ఆరు వారాల్లో పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.ఇదిలా ఉంటే గ్రూప్-1 పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం.

also read:లైవ్‌లోనే సహోద్యోగికి ప్రపోజ్: వైరలైన వీడియో

తెలంగాణ రాష్ట్రంలో కూడ గ్రూప్-1 పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.  గ్రూప్ -1 పరీక్షపేపర్లు లీకయ్యాయి.ఈ విషయం వెలుగు చూడడంతో  గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేశారు.ఆ తర్వాత నిర్వహించిన పరీక్ష విషయంలో  నిబంధనలు పాటించలేదని కొందరు అభ్యర్థులు  హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై విచారణ జరిపిన హైకోర్టు పరీక్షలను రద్దు చేసింది.  తాజాగా గ్రూప్ 1పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

 

 

click me!