పెళ్లి పత్రికతో పాటు విత్తనాలు కూడ పంచుతున్నారు ఆదిలాబాద్ కు చెందిన ఓ కుటుంబం.
ఆదిలాబాద్: పెళ్లి పత్రికను వినూత్నంగా తయారు చేయించారు.పెళ్లి పత్రికతో పాటు విత్తనాలను కూడ పంచుతున్నారు. ఈ విత్తనాలను నాటుకోవచ్చని వారు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ స్కూల్ ప్రిన్సిపాల్ కె. స్వర్ణలత తన కూతురు వైష్ణవి పెళ్లి సందర్భంగా పంచే వివాహ ఆహ్వాన పత్రికలతో పాటు విత్తనాలను పంచుతున్నారు.
పెళ్లి పత్రికతతో పాటు తులసి, బంతి, చామంతి విత్తనాలు పంచుతున్నారు. పెళ్లి పత్రికతో పాటు పెన్నును కూడ అందిస్తున్నారు.ఈ పెన్నులో టమాటా, కొత్తిమీర, వంకాయ, ముల్లంగి, పాలకూర వంటి విత్తనాలను ఉంచారు.
undefined
also read:లైవ్‌లోనే సహోద్యోగికి ప్రపోజ్: వైరలైన వీడియో
పెళ్లికి ఆహ్వానించేవారికి ఈ విత్తనాలను అందిస్తున్నారు. ఈ పెళ్లి పత్రికను రెండు గంటల పాటు నీటిలో నానబెట్టి పాతి పెడితే మొలకలు వస్తాయి.తమ కూతురు పెళ్లి పత్రిక ద్వారా కొత్త మొక్కలను నాటేందుకు వీలుగా ఈ ఆలోచన చేసినట్టుగా స్వర్ణలత చెప్పారు.
also read:టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు: ఎవరి లెక్కలు వారివి....
పెళ్లిళ్లను ఘనంగా నిర్వహించుకొనేందుకు చాలా మంది ఆశపడుతుంటారు. పెళ్లిళ్లకు ఘనంగా ఏర్పాట్లు చేస్తుంటారు. పెళ్లిళ్ల సమయంలో భోజనాలకు, పెళ్లి ఏర్పాట్లకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తుంటారు. మరికొందరు తమ పెళ్లిళ్లను సింపుల్ గా చేసుకుంటారు. పెళ్లికి అయ్యే ఖర్చును ఆశ్రమాలకు, స్వచ్ఛంధ సంస్థలకు అందిస్తుంటారు.