ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా సోకింది. అస్వస్థతకు గురైన గవర్నర్ చికిత్స కోసం హైద్రాబాద్ కు వచ్చారు. హైద్రాబాద్ ఆసుపత్రిలో చికిత్స చేయడంతో ఆయన కరోనా సోకిందని తేలింది.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు కరోనా సోకింది. తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో గవర్నర్ చికిత్స తీసుకొంటున్నారు.బుధవారం నాడు ఉదయం ప్రత్యేక విమానంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరించదన్ చికిత్స కోసం హైద్రాబాద్ కు వచ్చారు.Biswabhusan Harichandan ను వైద్యుల బృందం పరీక్షిస్తోంది. . గవర్నర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వైద్యుల బృందం గవర్నర్ ను పరీక్షిస్తుందని ఆసుపత్రి తెలిపింది. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఈ నెల 15న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు corona సోకిందని వైద్యులు తెలిపారు. రెండు రోజులుగా గవర్నర్ జలుబు, దగ్గుతో ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఇవాళ ఉదయమే ఆయన ప్రత్యేక విమానంలో hyderabad లోని ఆసుపత్రిలో చేరారు.ఏపీ గవర్నర్ ఇటీవలనే ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ నుండి వెళ్లి వచ్చిన నాటి నుండి ఆయన అస్వస్థతతో ఉన్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ ఇటీవల కాలంలో ఎవరిని కలిశారో వారంతా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకోవాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.ఏపీ గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. ఏపీ గవర్నర్ చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులతో సీఎం జగన్ మాట్లాడారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై జగన్ ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల అదుపునకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొంది. రాత్రిపూట కర్ఫ్యూ తో పాటు పగటిపూట ఆంక్షలను విధించింది. దీంతో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి.
ఏపీ గవర్నర్ ను పరామర్శించిన తమిళి సై
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనాతో హైద్రాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం నాడు పరామర్శించారు. బిశ్వభూషణ్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై తమిళిసై ఆరా తీశారు. వైద్యులతో తమిళిసై మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు.