ఇంటెలిజెన్స్ ఎస్పీగా జిందాల్... ఏపీలో భారీగా ఐపీఎస్ ల బదిలీలు

By Arun Kumar PFirst Published Jul 14, 2021, 12:18 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరిపాలనా పరంగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న చాలామంది ఐపిఎస్ లకు స్థానచలనం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ సర్కార్. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో భారీగా ఐపీఎస్ అధికారులకు బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. ఈ మేరకు బుధవారం అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేసింది జగన్ సర్కార్. మొత్తం 13 మంది ఐపీఎస్ అధికారులకు స్థానచలనం కల్పించారు. 

ప్రకాశం జిల్లా ఎస్పీ గా మాలికా గర్గ్ నియమితులయ్యారు. అలాగే విజయవాడ రైల్వే ఎస్పీగా రాహుల్ దేవ్ సింగ్, మంగళగిరి బెటాలియన్ కమాండెంట్ అజిత్ వేజెంట్ల, కాకినాడ బెటాలియన్ కమాండెంట్ గా జిఎస్ సునీల్ నియమితులయ్యారు. 

read more  ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాశ్ అధికారాలకు జగన్ ప్రభుత్వం కత్తెర

ఇక రాజమండ్రి అర్బన్ ఎస్పీ గా ఐశ్వర్య రస్తోగి, విశాఖ డిసిపి వన్ గా గౌతమి సలి బాధ్యత చేపట్టనున్నారు. ఇంటెలిజెన్స్ ఎస్పీగా  జిందాల్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గా షిమునిని నియమించింది జగన్ సర్కార్. 

పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా రాహుల్ దేవ్ శర్మ, ఆక్టోపస్ ఎస్పీ గా కోయ ప్రవీణ్, ఏపీ ఎస్పీ విజయనగరం బెటాలియన్ కామాండెంట్ గా విక్రంత్ పాటిల్, డిజిపి ఆఫీస్ లో అర్ఎం గా అమ్మిరెడ్డిని నియమించారు. నారాయణ నాయక్ ను డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. 
 

click me!