టీటీడీ భక్తులు మరో రెండు నెలలు ఆగాల్సిందే: ఆ దారి మూసివేత

By narsimha lodeFirst Published Jul 14, 2021, 11:53 AM IST
Highlights

 తిరుమల నడక మార్గాన్ని మరో రెండు నెలల పాటు మూసివేయనున్నారు.  ఈ మార్గంలో అభివృద్ది పనులు చేయడం కోసం రెండు మాసాల పాటు ఈ మార్గాన్ని మూసివేయాలని టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.


తిరుమల: తిరుమల నడక మార్గాన్ని మరో రెండు నెలల పాటు మూసివేయనున్నారు.  ఈ మార్గంలో అభివృద్ది పనులు చేయడం కోసం రెండు మాసాల పాటు ఈ మార్గాన్ని మూసివేయాలని టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకొన్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ మాసం లోపుగా  అలిపిరి నడకమార్గంలో పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.కాలినడకన శ్రీవారిని దర్శనం చేసుకోవాలని భావించే భక్తులు సెప్టెంబర్ వరకు వేచి చూడాల్సిందే. 

ఈ ఏడాది మే మాసంలో అలిపిరి మార్గంలోని మెట్ల మరమ్మత్తు పనులను టీటీడీ ప్రారంభించింది. అప్పటి నుండి అలిపిరి మెట్ల మార్గాన్ని టీటీడీ మూసివేసింది.ఈ ఏడాద సెప్టెంబర్ వరకు శ్రీవారి మెట్ల మార్గంలో భక్తులను అనుమతించబోమని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా శ్రీవారి మెట్టు నడకమార్గాన్ని వినియోగించుకోవాలని భక్తులకు టీటీడీ సూచించింది.

కరోనా నేపథ్యంలో భక్తుల సంఖ్య తగ్గడంతో మెట్ల మార్గంలో మరమ్మత్తులు చేపట్టారు. జులై‌కల్లా పనులు పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే నిర్ణీత కాలానికి పనులు పూర్తికాకపోవడంతో గడువు మరో రెండు నెలల పొడిగించింది.
 

click me!