రేషన్ డీలర్లతో ఏపీ ప్రభుత్వ చర్చలు విఫం: రేపు యధావిధిగా నిరసనలు

By narsimha lodeFirst Published Oct 26, 2021, 9:49 PM IST
Highlights

రేషన్ డీలర్లతో ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖాధికారులు మంగళవారం నాడు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. రేపు తలపెట్టిన నిరసన కార్యక్రమాలు యధావిధిగా కొనసాగిస్తామని ప్రభుత్వం రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది.
 

అమరావతి: రేషన్ డీలర్లతో ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖాధికారులు మంగళవారం నాడు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో రేపు యధావిధిగా నిరసనలను కొనసాగించనున్నట్టుగా రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది.తమ డిమాండ్ల సాధన కోసం ఏపీ రాష్ట్రంలో రేషన్ డీలర్లు ఇవాళ్టి నుండి రేషన్ షాపులు బంద్ చేసి తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ఇవాళ ఏపీ పౌరసరఫరాల శాఖాధికారులు రేషన్ డీలర్లతో చర్చించారు. అయితే ఈ చర్చలు విఫలమైనట్టుగా రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది.

also read:డీలర్ల బంద్‌తో రేషన్ పంపిణీ నిలిచిపోదు: ఏపీ మంత్రి కొడాలి నాని

రేపు రాష్ట్రంలోని గోడౌన్ల వద్ద నిరసనలు కొనసాగిస్తామని రేషన్ డీలర్ల అసోసియేషన్ ప్రకటించింది.2020 పీఎంజీకేవై కమిషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని, డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్కిలస్ ను అమలు చేయాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. 

ఐసీడీఎస్ కు మళ్లించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని రేషన్ డీలర్ల అసోసియేషన్  డిమాండ్ చేసింది. రేషన్ డీలర్ల బంద్ కు Tdp మద్దతును ప్రకటించింది.మరో వైపు Ration dealers  బంద్ చేసినంత మాత్రాన రేషన్ పంపిణీ నిలిచిపోదని ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి Kodali Nani  తేల్చి చెప్పారు.Ys Jagan ప్రవేశ పెట్టిన రేషన్ వెహికిల్స్ ఉన్నాయన్నారు.బైపాస్ పద్దతిలో రేషన్ పంపిణీ చేస్తామన్నారు. డీలర్లకు ఏమైనా సమస్యలుంటే చర్చల ద్వారాపరిష్కరించుకోవాలని ఆయన కోరారు
 

click me!