ప్రశాంతత కోసమే బయటకు వచ్చా: పట్టాభి

By narsimha lodeFirst Published Oct 26, 2021, 9:05 PM IST
Highlights

ప్రశాంతత కోసమే బయటకు వచ్చానని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. పట్టాభి మాల్దీవులకు వెళ్లారని సోమవారం నాడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఫోటోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

అమరావతి: తన కూతురును తీసుకొని  బయటకు వచ్చానని టీడీపీ అధికార ప్రతినిధి Pattabhi స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితం Rajahmundry జైలు నుండి విడుదలైన పట్టాభి  ఆచూకీ లేకుండా పోయాడు. అయితే సోమవారం నాడు ఆయన మాల్దీవులకు వెళ్లినట్టుగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు  బయటపడిన మరునాడే పట్టాభి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు.

also read:రెండు రోజులుగా అదృశ్యం: మాల్దీవుల్లో టీడీపీ నేత పట్టాభి?

ఏపీలో డ్రగ్స్ వ్యవహారాల పై మాట్లాడిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఇంటిపై వైసీపీ రౌడీలు దాడిచేసి విధ్వంసం సృష్టించారు. ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న పట్టాభి కూతురు, ఎనిమిదేళ్ల చిన్నారి షాక్ కు గురైంది.(1/2) pic.twitter.com/bfKwLj159A

— Telugu Desam Party (TDP Official) (@JaiTDP)

 తన ఇంటిపై జరిగిన దాడిలో తన కుమార్తె తీవ్రమైన మనోవేదనలోకి వెళ్లిందని ఆయన  ఆ వీడియోలో పేర్కొన్నారు. తన కుమార్తెను తీసుకుని బయటకు వచ్చానని పట్టాభి వివరించారు. తన కుటుంబ సభ్యుల ప్రశాంతత కోసమే బయటకు వచ్చానని ఆయన తెలిపారు. తర్వలోనే మళ్లీ వచ్చి పార్టీలో క్రీయాశీలక పాత్ర నిర్వహిస్తానన్నారు. తనపై నమోదైన కేసుల విషయమై న్యాయస్థానాలను ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు. తాను మాట్లాడిన వ్యాఖ్యలకు లేని అర్థాలను సృష్టించారని చెప్పారు. 

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఏపీ సీఎం Ys Jagan పై బూతు వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టాభి నివాసంతో పాటు Tdp కేంద్ర కార్యాలయంపై Ycp శ్రేణులు దాడులకు దిగాయి. ఈ  దాడులను నిరసిస్తూ టీడీపీ చీఫ్  Chandrababunaidu 36 గంటల దీక్షకు దిగాడు. ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతిని కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేశాడు.ఇవాళే ఢిల్లీ నుండి ఆయన హైద్రాబాద్ కు తిరిగి వచ్చారు. మరో వైపు టీడీపీ నేత పట్టాభి, చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని కోరుతూ వైసీపీ జనాగ్రహ దీక్షలకు దిగింది.

click me!