విశాఖలో ప్రారంభమైన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: ముఖేష్ అంబానీ సహా పలువురు హాజరు

By narsimha lode  |  First Published Mar 3, 2023, 10:30 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  విశాఖపట్టణంలో  గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్    ఇవాళ ప్రారంభమైంది.  26 దేశాల నుండి ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొన్నారు. 



విశాఖపట్టణం:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న  గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్  శుక్రవారం నాడు  విశాఖపట్టణంలో  ప్రారంభమైంది.. తొలుత  మా తెలుగు తల్లికి మల్లెపూదండ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు.  ఈ గీతం  ఆలపించిన  తర్వాత  జ్యోతి ప్రజ్వలనతో  సమ్మిట్  ప్రారంభమైంది.  26 దేశాల నుండి   ప్రతినిధులు ఈ సమావేశానికి హజరయ్యారు.  ఆయా దేశాల  పారిశ్రామికవేత్తలు,   పెట్టుబడిదారులు  ఈ సమ్మిట్ లో  పాల్గొంటున్నారు.   26 దేశాల నుండి 10 వేల మందిప్రతినిధులు  పాల్గొంటున్నారుఇండియాకు  చెందిన  ప్రముఖ పారిశ్రామిక వేత్తలు  కూడా  ఈ సమ్మిట్ లో  పాల్గొంటున్నారు. 

Latest Videos

undefined

ప్రముఖ పారిశ్రామికవేత్త  ముఖేష్ అంబానీ , జీఎంఆర్ సంస్థ  ప్రతినిధులు  కూడా ఇవాళ ఉదయమే  సమ్మిట్  కు హజరయ్యారు.   ప్రత్యేక విమానంలో  అంబానీ  విశాఖపట్టణం  చేరుకున్నారు.   అంబానీకి  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  ప్రధాన కార్యదర్శి  మంత్రి రజని,  వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తదితరులు స్వాగతం పలికారు.  

.  ఈ సమ్మిట్  కు  ప్రభుత్వం  అధిక  ప్రాధాన్యత ఇచ్చింది.  ఈ సమ్మిట్ లో  పాల్గొన్న  పారిశ్రామికవేత్తల్లో  21 మంది  ప్రసగించనున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ  ఈ సమ్మిట్ ను ఉద్దేశించి కీలక ఉపన్యాసం  చేస్తారు.

గ్లోబల్ ఇన్వెస్టర్  సమ్మిట్  లో  సుమారు  రూ. 2 లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు  చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ సమ్మిట్  లో పాల్గొనేందుకు గాను ఏపీ సీఎం  వైఎస్ జగన్  నిన్న సాయంత్రమే  విశాఖపట్టణం  చేరుకున్నారు.

వివిధ దేశాల నుండి  రానున్న  పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల కోసం  విశాఖలో  రాష్ట్ర ప్రభుత్వం  పెద్ద ఎత్తున ఏర్పాట్లు  చేసింది. విమానాశ్రయం నుండి  సమ్మిట్  జరిగే  ప్రాంతానికి లగ్జరీ కార్లను  ఏర్పాటు  చేశారు  ప్రతినిధులు  బస చేసేందుకు  వీలుగా  నగరంలో ప్రముఖ హోటల్స్ ను సిద్దం  చేశారు.  సమ్మిట్  జరిగే  ప్రాంగణంలో  సమావేశాల  కోసం   ప్రత్యేకంగా  ఏర్పాట్లు  చేశారు. అంతేకాదు  ఈ సమావేశానికి హజరైన  అతిథులకు భోజన వసతి కోసం కూడా  ప్రత్యేకంగా  డైనింగ్  హల్ ఏర్పాటు చేశారు. 
 

click me!