జగన్ ప్రభుత్వాన్ని జనసేన పూర్తి మద్దతు.. సాధరంగా స్వాగతించిన వైసీపీ నాయకులు

Published : Mar 03, 2023, 10:19 AM IST
జగన్ ప్రభుత్వాన్ని జనసేన పూర్తి మద్దతు.. సాధరంగా స్వాగతించిన వైసీపీ నాయకులు

సారాంశం

విశాఖపట్నంలో నేడు, రేపు జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి మద్దతు తెలిపారు. పెట్టుబడిదారులకు ఇక్కడి యువత సంపూర్ణంగా న్యాయం చేస్తారని తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. 

ఏపీ వైసీపీ ప్రభుత్వానికి జనసేన పూర్తి మద్దతు అందించింది. రాజకీయాల కంటే రాష్ట్రమే ముఖ్యమని అని పేర్కొంది. రెండు రోజుల పాటు రాజకీయ విమర్శలు చేయబోమని ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం విశాఖపట్నంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు సందర్భంగా జనసేన ఈ విధంగా స్పందించింది. 

స్నేహితుడి ప్రియురాలికి న్యూడ్ వీడియోలతో వేధింపులు.. మురళీకృష్ణ హత్యకు అక్కడే బీజం...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్శించేందుకు రెండు రోజుల పాటు గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు ను నిర్వహిస్తోంది. విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కాలేజీ దీనికి వేధికగా నిలవనుంది. శుక్రవారం, శనివారం ఈ కార్యక్రమం కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రాజకీయాలు పక్కన పెట్టి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెట్టుబడిదారులను ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆయన వరుస ట్వీట్లు చేశారు.

ఆ ట్వీట్లలో ఆయన ఏపీలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని పెట్టబడిదారులను కోరారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించాలని వైసీపీ ప్రభుత్వానికి సూచించారు. సదస్సుపై తాను ఎలాంటి విమర్శలు చేయనని, రాజకీయాల కంటే ఏపీ భవిష్యత్తు తనకు ముఖ్యమని అన్నారు. 

ప్రకృతి అందాలతో విరాజిల్లుతున్న విశాఖ నగరానికి దేశ, విదేశాల నుంచి వస్తున్న పెట్టుబడిదారులందరికీ జనసేన స్వాగతం పలుకుతోందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మా శక్తియుక్తమైన, అనుభవజ్ఞులైన యువత మిమ్మల్ని ఆకట్టుకుంటారని తాను ఆశిస్తున్నానని చెప్పారు. ఈ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఏపీకి మంచి భవిష్యత్తు లభిస్తుందని తాను భావిస్తున్నానని పేర్కొన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని, పెట్టుబడిదారులు తగిన ప్రతిఫలాన్ని పొందుతారని పవన్ కళ్యాణ్ అన్నారు.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ పలు సూచనలు చేశారు. ఏపీలో ఆర్థిక వృద్ధి అవకాశాలు, శక్తివంతమైన మానవ వనరులు, ఖనిజ సంపద, తీరప్రాంతం తదితర అంశాలను పెట్టుబడిదారులకు వివరించాలని తాను వైసీపీ ప్రభుత్వానికి హృదయపూర్వకంగా విన్నవిస్తున్నానని తెలిపారు. రివర్స్ టెండరింగ్, మీడియేటర్ల కమీషన్లు వంటి ఎలాంటి అడ్డంకులూ లేకుండా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపాలని ఆయన కోరారు. అయితే ఈ సదస్సులోని ఆలోచనలను కేవలం విశాఖపట్నానికే పరిమితం చేయవద్దని పవన్ కల్యాణ్ సూచించారు. తిరుపతి, అమరావతి, అనంతపురం, కాకినాడ, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు, కడపతో పాటు ఏపీలోని ఇతర ప్రాంతాల్లోని అభివృద్ధి అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించాలని కోరారు. 

పెట్టబడిదారుల సదస్సు సందర్భంగా తమ పార్టీ రెండు రోజుల పాటు ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయబోదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి తాము పూర్తిగా సపోర్ట్ చేస్తామని పేర్కొన్నారు. తమకు రాజకీయాల కంటే రాష్ట్రమే ముఖ్యమని తెలిపారు. అయితే పవన్ కల్యాణ్ స్పందించిన తీరుపై ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సూచలను వైసీపీ నాయకులు సాధరంగా ఆహ్వానించారు. కాగా.. నేడు రేపు జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే