చరిత్ర గతిని మార్చిన వైఎస్ఆర్: వైఎస్ఆర్ అవార్డులను ప్రధానం చేసిన జగన్ సర్కార్

By narsimha lode  |  First Published Nov 1, 2023, 1:16 PM IST

వైఎస్ఆర్ అవార్డుల ప్రధానోత్సవాన్ని ఇవాళ ఏపీ ప్రభుత్వం ప్రధానం చేసింది.  విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో  సీఎం జగన్ , గవర్నర్ అవార్డులు ప్రదానం చేశారు.


అమరావతి: వైఎస్ రాజశేఖర్ రెడ్డి  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర గతిని మార్చారని  ఏపీ సీఎం వైఎస్ జగన్  పేర్కొన్నారు. వైఎస్ఆర్ అవార్డులను  ఏపీ ప్రభుత్వం బుధవారంనాడు  ప్రకటించింది.  ఏడు రంగాల్లో విశిష్ట సేవలందించిన  27 మందికి అవార్డులను అందించింది ప్రభుత్వం. దీంతో పాటుగా  23 లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, నాలుగు వైఎస్ఆర్ అచీవ్ మెంట్ అవార్డులను కూడ ప్రభుత్వం అందించింది.

 విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించి  ఇవాళ్టికి 67 ఏళ్లు అవుతుందన్నారు.ఈ రోజున వైఎస్ఆర్ అవార్డులు ఇవ్వడం  సంతోషంగా ఉందన్నారు . వరుసగా  మూడో ఏడాది ఈ అవార్డులు అందిస్తున్నట్టుగా  జగన్ గుర్తు చేశారు. మన రాష్ట్రాన్ని వివిధ రంగాల్లో దశాబ్దాలుగా సుసంపన్నం చేసిన మహనీయులను గౌరవిస్తూ వైఎస్సార్‌ అవార్డులతో సత్కరించే ఈ సంప్రదాయం మూడు సంవత్సరాలుగా చేస్తున్న విషయాన్ని సీఎం జగన్ గుర్తు చేశారు.

Latest Videos

undefined

మన సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తూ వివిధ రంగాల్లో ఆకాశమంత ఎదిగినా సామాన్యులుగానే ఒదిగి ఉన్న అసామాన్యులకు అవార్డులు ఇస్తున్నట్టుగా ఆయన వివరించారు. 

ఈ ఏడాది 27 మందిని  వైఎస్సార్‌ అవార్డులతో సత్కరిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఇందులో నలుగురికి అచీవ్‌మెంట్, 23 మందికి లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానం చేయబోతున్న విషయాన్ని వివరించారు.డాక్టర్‌ వైఎస్ఆర్  హయాంలో వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం ఇలా ఏ రంగాన్ని తీసుకన్నా అంతకు ముందున్న చరిత్ర గతిని మార్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.ఈ అవార్డులు అందుకుంటున్నవారు  తమ రంగాల్లో వారి జీవితాన్ని అర్పించారని  సీఎం గుర్తు చేశారు. 

also read:ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం 2023: తాడేపల్లిలో జాతీయ జెండా ఆవిష్కరించిన జగన్

అవార్డులు పొందిన వారంతా మన జాతి సంపదగా సీఎం పేర్కొన్నారు.ఈ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్.అనంతరం ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్  ప్రసంగించారు. ఏపీ ప్రజలందరికీ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సాగునీటి రంగంలో, వ్యవసాయం లో , వైద్య రంగంలో 108 లాంటి సేవలు అందించిన వైఎస్ఆర్ ప్రజలకు ఎప్పుడూ గుర్తు ఉంటారన్నారు.

ఏపీ లో మొదలు పెట్టిన 108 సేవలు దేశ వ్యాప్తంగా  విస్తరించేందుకు వైఎస్ అర్ కృషి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.సామాజిక , ఆర్థిక అభ్యున్నతికి వైఎస్ఆర్ కృషి చేసినట్టుగా గవర్నర్ గుర్తు చేశారు. 

వైఎస్ఆర్ పేరిట  అవార్డులు ఇవ్వటం సంతోషదాయకమన్నారు. సంక్షేమ పథకాలతో పాటు కొన్ని ఇండికేటర్ లలో ఏపీ అగ్రగామిగా ఉందని గవర్నర్  తెలిపారు. ఏపీ ప్రజలు మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పారు.


వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు గ్రహీతలు

కళా రంగం - పద్మశ్రీ యడ్ల గోపాల రావు
కలంకారీ కళాకారుడు-  టీ.మోహన్ 
బాపట్ల -  కోటా సచ్చిదానంద శాస్త్రి 
తప్పెటగుళ్ళు కళాకారుడు - కోన సన్యాసి 
 
ప్రముఖ చిత్రకారుడు - ఎస్వీ రామారావు 
ప్రముఖ గాయకురాలు-  రావు బాల సరస్వతి
చిత్రకారుడు - తల్లావజ్జుల శివాజీ 
రంగస్థల కళాకారుడు-  చిగిచెర్ల కృష్ణా రెడ్డి
ప్రముఖ నాద స్వర కళాకారులు-  కాలిషా బీ, మెహబూబ్ సుభాని
సాహిత్యం-  బేతవోలు రామబ్రహ్మం 
రచయిత - నామిని సుబ్రహ్మణ్యం నాయుడు
సాహిత్యం-  అట్టాడ అప్పలనాయుడు

క్రీడా రంగం-  పుల్లెల గోపీచంద్, 
కరణం మల్లీశ్వరి

వైద్య రంగం-  ఇండ్ల రామ సుబ్బారెడ్డి
డాక్టర్ ఈ సీ వినయ్ కుమార్

 మీడియా రంగం- గోవిందరాజు చంద్రశేఖర్
హనుమంత రెడ్డి

సామాజిక సేవ-  బెజవాడ విల్సన్,కే.శ్యామ్ మోహన్ రావు,నిర్మల్ హృదయ భవన్,డాక్టర్ జి. సమరం లకు వై ఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లు దక్కాయి. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ అవార్డులను అందించారు.ఈ కార్యక్రమంలో  వైఎస్ విజయమ్మ కూడ పాల్గొన్నారు.
 

click me!