ఏపీలో పోలీస్ ఉద్యోగార్ధులకు శుభవార్త: రెండేళ్ల వయస్సు సడలింపునకు వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్

By narsimha lode  |  First Published Dec 23, 2022, 1:41 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్ మెంట్ కు సంబంధించి  గరిష్ట వయస్సుకు  రెండేళ్ల వయస్సు  సడలిస్తూ జగన్  సర్కార్  నిర్ణయం తీసుకుంది.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ రిక్రూట్ మెంట్ లో  గరిష్ట  వయస్సుకు  రెండేళ్ల వయస్సు సడలిస్తూ ఇస్తూ  ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ఈ ఏడాది నవంబర్  28న  పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిపికేషన్ జారీ చేసింది.  6511 పోస్టులను భర్తీ చేయాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 6100 కానిస్టేబుల్స్,  411 ఎస్ఐ పోస్టు లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన  నోటిఫికేషన్ ప్రకారంగా  3,580 సివిల్ కానిస్టేబుల్స్,  315 సివిల్ ఎస్ఐ, 96 రిజర్వ్  ఎస్ఐ, 2520 ఏపీఎస్పీ  కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు.వచ్చే ఏడాది జనవరి  22న  కానిస్టేబుల్ పరీక్షలకు  రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఎస్ఐ పోస్టులకు వచ్చే ఏడాది ఫిబ్రవరి  19న పరీక్ష నిర్వహించనున్నారు. పోలీస్ శాఖలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు  చేస్తున్న అభ్యర్ధుల వినతి  మేరకు  రెండేళ్ల పాటు  వయస్సును సడలిస్తూ  ఏపీ  సర్కార్ నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుల్  ఉద్యోగాల కోసం  పోటీ పడుతున్న అభ్యర్ధులకు ఈ సడలింపు వర్తించనుంది.  ఈ విషయమై అభ్యర్ధులు ప్రభుత్వాన్ని కోరడంతో  సీఎం జగన్ సానుకూలంగా  నిర్ణయం తీసుకున్నారు. 

Latest Videos

undefined

ఆంధ్రప్రదేశ్  పోలీస్ రిక్రూట్ మెంట్  బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ లో  సూచించిన గరిష్ట వయస్సును రెండేళ్ల పాటు మిసడలించనున్నారు.. ఆయా పోస్టులకు  ఒక్కో రకంగా  వయో పరిమితిని విధించారు. పోలీస్ శాఖ జారీ చేసిన  వయో పరిమితులను నోటీఫికేషన్ లో పొందుపర్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ఇటీవలనే పోలీస్ నియామాకాలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది.  రాత పరీక్షలు  పూర్తయ్యాయి.  అంతేకాదు  ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలను నిర్వహించనున్నారు. తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్,  ఎక్సైజ్ కానిస్టేబుల్  పోస్టులకు  రాత పరీక్షలు నిర్వహించారు.  ఈ రాత పరీక్షల్లో  2,37,862 మంది అర్హత  సాధించారు.  రాత పరీక్షల్లో  అర్హత సాధించినవారికి  ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలను  నిర్వహిస్తున్నారు.  ఈ నెల  8వ తేదీన  వచ్చే ఏడాది జనవరి తొలి వారం వరకు  ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షలను నిర్వహించనున్నారు.

click me!