108 సార్లు మంత్రం పఠించండి: కరోనా రాదని తేల్చిసిన బాలకృష్ణ

Published : Aug 31, 2020, 02:55 PM IST
108 సార్లు మంత్రం పఠించండి: కరోనా రాదని తేల్చిసిన బాలకృష్ణ

సారాంశం

కరోనా నివారణకు వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశోధన సంస్థలు ప్రయత్నాలు చేస్తోంటే.... మంత్రాలతో కరోనా రాదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తేల్చిచెప్పారు.  

హిందూపురం: కరోనా నివారణకు వ్యాక్సిన్ కోసం ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశోధన సంస్థలు ప్రయత్నాలు చేస్తోంటే.... మంత్రాలతో కరోనా రాదని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తేల్చిచెప్పారు.  

అస్మిన్ పరాత్మన్ నను పాదకల్పే త్వమిత్థముత్థాపిత పద్మయోనిః అనంతభూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయవాస ! విష్ణో !  అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే కరోనా దరిదాపులకే రాదని బాలకృష్ణ చెప్పారు.

కరోనా కారణంగా తన నియోజకవర్గమైన హిందూపురానికి ఐదు మాసాలుగా బాలకృష్ణ దూరంగా ఉన్నారు. అయితే హిందూపురంలో ఏర్పాటు చేసిన కోవిడ్ ఆసుపత్రికి తన స్వంత నిధులతో బాలకృష్ణ పరికరాలను అందించారు. రూ. 55 లక్షలను స్వంత నిధులతో కరోనా నియంత్రణ వైద్య పరికరాలు, మందులను బాలకృష్ణ అందించారు.

 

ఈ సందర్భంగా ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కరోనా రాకుండా ఉండేందుకు గాను తాను చెప్పిన మంత్రం పాటించాలని ఆయన సూచించారు. 

కరోనాపై పోరాటానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు బాలకృష్ణ రూ. 50 లక్షల రూపాయాల చొప్పున అందించారు. సినీ కార్మికుల కోసం బాలకృష్ణ రూ. 25 లక్షలను విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.
 

PREV
click me!

Recommended Stories

Minister Satya Kumar Yadav Pressmeet: జిల్లాల విభజనపై సత్యకుమార్ యాదవ్ క్లారిటీ| Asianet News Telugu
AP Cabinet Big Decision: ఏపీలో ఇక 29 కాదు 28 జిల్లాలుమంత్రులు కీలక ప్రెస్ మీట్ | Asianet News Telugu