ఏపీలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..

By Sumanth KanukulaFirst Published Aug 23, 2022, 4:14 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న‌ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న‌ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం  రాష్ట్రంలో 502 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు స్కూల్ ఎడ్యూకేషన్ కమిషనర్ సురేష్ కుమార్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం లిమిటేడ్‌ రిక్రూట్‌మెంట్‌-2022ను చేపడుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూల్స్ మొత్తం 214 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో జడ్పీ, ఎంపీపీ స్కూళ్లలో 199 పోస్టులు (ఎస్జీటీ 123, ఏస్‌ఏ 69, మ్యూజిక్ 7), మున్సిపల్ స్కూళ్లలో 15 పోస్టులు (ఎస్జీటీ 5, ఏస్‌ఏ 10) ఉన్నాయి.

ఇక, మోడల్ స్కూల్స్‌లో మొత్తం 207 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో పీజీటీ 176, టీజీటీ 31 పోస్టులు ఉన్నాయి. ఇక, ఐఈడీఎస్‌ఎస్‌‌లో 81 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పరీక్షల తేదీలు, అర్హతలు, ఇతర అన్ని వివరాలను నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. 

నోటిఫికేషన్ ప్రకారం.. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ https://cse.ap.gov.in/లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రేపటి నుంచి సెప్టెంబర్ 17 వరకు ఫీజు చెల్లింపుకు అవకాశం కల్పించారు. ఈ నెల 25 నుంచి సెప్టెంబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 23వ తేదీ నుంచి పరీక్ష నిర్వహించనున్నారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్ష నిర్వహించనున్నారు. అక్టోబర్ 28న ప్రైమరీ కీ విడుదల చేయనున్నారు. అక్టోబర్ 31 వరకు ప్రైమరీ కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. నవంబర్ 2వ తేదీన ఫైనల్ కీ విడుదల చేయనున్నారు.  నవంబర్ 4న ఫలితాలను విడుదల చేయనున్నారు.
 

click me!