AP DSC: ఆంధ్ర‌ప్ర‌దేశ్ డీఎస్సీపై సుప్రీం కీల‌క తీర్పు.. ఆ పిటిష‌న్ తిర‌స్క‌ర‌ణ

Published : May 23, 2025, 05:44 PM IST
Supreme Court

సారాంశం

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీ మేర‌కు మెగా డీఎస్సీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ప‌రీక్షల తేదీల‌ను వాయిదా వేయాల‌ని కొంత మంది అభ్య‌ర్థులు సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా. 

ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ (డిప్లొమా ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్) మరియు టెట్ (టిచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షల షెడ్యూల్ విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే విడుదల చేసిన డీఎస్సీ షెడ్యూల్‌ను కొనసాగించమన్నారు.

 టెట్, డీఎస్సీ పరీక్షల తేదీలను వాయిదా వేయాలని కొంత మంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినా, వారు చెల్లుబాటు చేసే కారణాలు సమర్థవంతంగా లేవని ధర్మాసనం భావించింది. అందుకే ఆ పిటిషన్‌ను తక్షణమే తిరస్కరించింది.

జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈ విషయాన్ని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. అందువల్ల టెట్, డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతాయని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి 2025 ఏప్రిల్ 20న నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీ పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) రూపంలో నిర్వహించనున్నట్లు అధికారికంగా తెలియజేశారు. ఈ పరీక్షల ద్వారా రాష్ట్రంలోని పాఠశాలల్లో నూతన ఉపాధ్యాయుల‌ను నియ‌మించనున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్