ఆత్మహత్య కోసం కాలువలోకి.. ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్ (వీడియో)

Siva Kodati |  
Published : Jan 19, 2022, 10:21 PM ISTUpdated : Jan 19, 2022, 10:22 PM IST
ఆత్మహత్య కోసం కాలువలోకి.. ప్రాణాలకు తెగించి కాపాడిన కానిస్టేబుల్ (వీడియో)

సారాంశం

సాహసోపేతంగా ఓ నిండు ప్రాణాన్ని కాపాడి శెభాష్ అనిపించుకున్నాడో విజయవాడ పోలీస్. వివరాల్లోకి వెళితే.. కుంచనపల్లి (kunchanapally) హైవే దగ్గర బ్రిడ్జి పైనుంచి బకింహామ్ కెనాల్‌లో (buckingham canal) దూకాడు విజయవాడ (vijayawada) ప్రసాదంపాడుకు చెందిన వెంకటేశ్వర్లు (70).

సాహసోపేతంగా ఓ నిండు ప్రాణాన్ని కాపాడి శెభాష్ అనిపించుకున్నాడో విజయవాడ పోలీస్. వివరాల్లోకి వెళితే.. కుంచనపల్లి (kunchanapally) హైవే దగ్గర బ్రిడ్జి పైనుంచి బకింహామ్ కెనాల్‌లో (buckingham canal) దూకాడు విజయవాడ (vijayawada) ప్రసాదంపాడుకు చెందిన వెంకటేశ్వర్లు (70). అయితే ఆ సమయంలో అటుగా వెళుతున్న విజయవాడ క్లూస్ టీం కానిస్టేబుల్ (pc2882) సురేష్ కుమార్ బ్రిడ్జిపై నుంచి బకింహామ్ కెనాల్‌లో దూకి సకాలంలో బాధితుడిని ఒడ్డుకు చేర్చాడు. దీంతో వెంకటేశ్వర్లకు ప్రాణాపాయం తప్పింది. 

ఆరు నెలలుగా నిద్ర లేకపోవడంతో మనోవేదనతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం  వెంకటేశ్వర్లును తీసుకొని తాడేపల్లి పోలీసులకు అప్పగించాడు సురేష్ కుమార్.  విషయం తెలుసుకుని కానిస్టేబుల్ సురేష్ కుమార్‌ని అభినందించారు ఉన్నతాధికారులు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వెంకటేశ్వర్లును అప్పగించారు తాడేపల్లి పోలీసులు. 

 

"

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu