హనుమంతుడి జన్మస్థలంపై వివాదం: టీటీడీ, కిష్కింధ సంస్థాన్ ల మధ్య చర్చలు

By narsimha lode  |  First Published May 27, 2021, 11:48 AM IST

 హనుమంతుడి జన్మస్థలంపై మరోసారి వివాదం  కొనసాగుతోంది. తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ  గతంలో ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను  కర్ణాటకలోని కిష్కింద సంస్థానం తోసిపుచ్చింది. దీంతో టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీతో  కిష్కింధ సంస్థానం ప్రతినిధులు గురువారం నాడు చర్చిస్తున్నారు.


తిరుపతి: హనుమంతుడి జన్మస్థలంపై మరోసారి వివాదం  కొనసాగుతోంది. తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ  గతంలో ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను  కర్ణాటకలోని కిష్కింద సంస్థానం తోసిపుచ్చింది. దీంతో టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీతో  కిష్కింధ సంస్థానం ప్రతినిధులు గురువారం నాడు చర్చిస్తున్నారు.

 టీటీడీ రాష్ట్రీయ సంస్కృత పీఠంలో గురువారం నాడు ఈ విషయమై కిష్కింధ సంస్థాన ప్రతినిధులతో టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ ప్రతినిధులు చర్చిస్తున్నారు. కిష్కింధ సంస్థానం తరపున శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి  ఈ చర్చల్లో పాల్గొన్నారు

Latest Videos

undefined

also read:హనుమంతుడి జన్మస్థలం తిరుమల అంజనాద్రే: టీటీడీ

టీటీడీ తరపున సంస్కృత యూనివర్శిటీ వీసీతో పాటు టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు  ఈ చర్చలో పాల్గొన్నారు. హనుమంతుడి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రేనని టీటీడీ బృందం, కిష్కింధలోని అంజనాద్రే వాయుపుత్రుడి పుట్టిన స్థలమని వాదిస్తున్నారు. ఈ చర్చల తర్వాత చర్చల సారాంశాన్ని ప్రకటించే అవకాశం ఉంది. గత నెలలోనే తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది.ఈ మేరకు తాము సేకరించిన ఆధారాలను టీటీడీ నియమించిన కమిటీ మీడియాకు తెలిపింది. 


 

click me!