అమిత్‌షాతో మరోసారి సీఎం జగన్ భేటీ: కీలకాంశాలపై చర్చ

Published : Sep 23, 2020, 11:13 AM IST
అమిత్‌షాతో మరోసారి సీఎం జగన్ భేటీ: కీలకాంశాలపై చర్చ

సారాంశం

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు ఉదయం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.మంగళవారం నాడు మధ్యాహ్నం తాడేపల్లి నుండి న్యూఢిల్లీకి బయలుదేరిన సీఎం జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు ఉదయం న్యూఢిల్లీలో భేటీ అయ్యారు.మంగళవారం నాడు మధ్యాహ్నం తాడేపల్లి నుండి న్యూఢిల్లీకి బయలుదేరిన సీఎం జగన్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.

మంగళవారం నాడు రాత్రి సుమారు గంటకు పైగా సీఎం జగన్ అమిత్ షాతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. నిన్న జరిగిన సమావేశానికి కొనసాగింపుగా ఇవాళ మరోసారి సీఎం జగన్ అమిత్ షాతో భేటీ అయ్యారు.

also read:ఢిల్లీకి బయల్దేరిన ఏపీ సీఎం వైఎస్ జగన్: నేడు అమిత్ షాతో భేటీ

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి కలిశారు. మంగళవారం సాయంత్రం ఆయన అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఆయన మరోసారి అమిత్ షాను కలిశారు. రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై ఆయన అమిత్ షాతో చర్చించారు.

అమిత్ షాతో జగన్ దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. జగన్ తో పాటు ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి అమిత్ షాను కలిశారు అంతర్వేద రథం దగ్ధం ఘటన, అమరావతి భూకుంభకోణం, ఫైబర్ గ్రిడ్ కుంభకోణం అంశాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని జగన్ అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది.
రెండు సార్లు అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.

ఇవాళ ఉదయం కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర షెకావత్ తో సీఎం జగన్ చర్చించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తో పాటు పాలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల విషయమై సీఎం జగన్ కేంద్ర మంత్రితో చర్చించారు.
 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు