పోలవరం ప్రాజెక్టుకు అవసరమై నిధుల కేటాయింపు విషయమై మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. ప్రధాని అపాయింట్ మెంట్ ను కోరినట్టుగా చెప్పారు.
ఏలూరు:Polavaram ప్రాజెక్టుకు అవసరమైన నిధుల కేటాయింపు విషయమై మరోసారి ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తానని ఏపీ సీఎం వైYS Jagan చెప్పారు. ప్రధాని అపాయింట్ మెంట్ కోరినట్టుగా ఆయన చెప్పారు.
పశ్చిమ గోదావరి జిల్లాలోని వేలేరుపాడు మండలం తిరుమలాపురం, నార్లవరంలలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వరద బాధితులతో మాట్లాడారు. గురువారం నాడు .వరద బాధిత గ్రామాల్లో ఫోటో గ్యాలరీని సీఎం జగన్ పరిశీలించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సహాయం చేయక తప్పదన్నారు.
undefined
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుండి ఇంకా రూ. 2900 కోట్లు రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. కేంద్రం నుండి పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నామన్నారు. ప్రతి నెల కేంద్ర మంత్రులతో, అధికారులతో నిధుల విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 500 ,రూ. 1000 కోట్లు అయితే పోలవరం పునరావాసం ఖర్చు చేసే వాళ్లమన్నారు. పునరావాస ప్యాకేజీ కోసం జగన్ కూడా సరిపోవడం లేదన్నారు.
ఇదే విషయమై తాను కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలుస్తున్నట్టుగా సీఎం గుర్తు చేశారు.పోలవరం ప్రాజెక్టు నిధుల విషయమై కేంద్రంలో అంత స్థాయిలో కదలిక రావడం లేదని సీఎం జగన్ చెప్పారు. ఆలస్యం జరిగిన కొద్దీ కేంద్ర ప్రభుత్వానికి కూడా నష్టమేనని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా భారం పెరిగే అవకాశం ఉందన్నారు.
పోలవరం ప్రాజెక్టులో పునరావాస ప్యాకేజీకి రూ. 22 వేల కోట్లు అవసరమౌతాయన్నారు. పోలవరం ప్రాజెక్టులో 41 అడుగుల నీటిని నింపడానికి ముందే ముంపు బాధితులకు పరిహారం చెల్లిస్తామన్నారు.పోలవరం ప్రాజెక్టుకు విఁషయమై ఇప్పటికే మూడు సార్లు ప్రధానితో చర్చించినట్టుగా చెప్పారు. మరోసారి ప్రధాని అపాయింట్ మెంట్ ను కోరినట్టుగా జగన్ చెప్పారు.
Flood ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం బాగా పనిచేసిందని సీఎం జగన్ మెచ్చుకున్నారు. ఇంత పారదర్శకంగా గతంలో ఎప్పుడూ కూడా వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు సహాయం అందలేదని సీఎం జగన్ చెప్పారు.
also read:పరిహారం చెల్లించాకే పోలవరం పూర్తి స్థాయిలో నింపుతాం: కోయగూడలో వైఎస్ జగన్
ఇళ్లు కోల్పోయిన వారికి రూ. 10 వేల ఆర్ధిక సహాయం అందిస్తామని సీఎం జగన్ చెప్పారు. ఏ సీజన్ లో నష్టం జరిగితే అదే సీజన్ లో సహాయం అందిస్తామని కూడా ఆయన చెప్పారు. వరద నష్టంపై అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా సీఎం ప్రకటించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ రెండు రోజులుగా పర్యటిస్తున్నారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించారు. ముంపు ప్రాంతాల ప్రజల పరిస్థితిని తెలుసుకొన్నారు. వరదలు వచ్చిన సమయంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ముంపు గ్రామాల ప్రజలకు నిత్యావసర సరుకులతో పాటు రూ. 2 వేల ఆర్ధిక సహాయం అందించాలని ఆదేశించారు. సరుకులు, ఆర్ధిక సహాయం అందిందా లేదా అనే విషయాన్ని కూడా సీఎం జగన్ బాధితులను అడిగి తెలుసుకొన్నారు.