ఆస్తుల కేసు: సీబీఐ కోర్టుకు హాజరైన ఏపీ సీఎం జగన్

By narsimha lodeFirst Published Jan 10, 2020, 10:47 AM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. 

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారంనాడు హైద్రాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకొన్నారు.బేగంపేట విమానాశ్రయం నుండి వైఎస్ జగన్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.

Also read:అక్రమాస్తుల కేసు: తప్పనిసరి పరిస్థితుల్లో, ఎల్లుండి సీబీఐ కోర్టుకి జగన్

ఆస్తుల కేసులో వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని నాంపల్లిలోని సీబీఐ కోర్టు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. శుక్రవారం నాడు తప్పనిసరిగా సీబీఐ కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.

Also Read:జగన్‌కు సీబీఐ కోర్టు షాక్: కీలక ఆదేశాలు

Also Read:ఆరేళ్లలో ఏనాడైనా ఆరోపణలు వచ్చాయా....?: సీబీఐ కోర్టులో సీఎం జగన్

ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావులు కూడ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. మాజీ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి కూడ కోర్టుకు హాజరయ్యారు.

ఏపీ సీఎం వైఎస్ జ‌గన్ కు  సీబీఐ కోర్టు ఈ నెల 3వ తేదీన షాకిచ్చింది. ఈ నెల 10 వ తేదీన  కోర్టుకు జగన్ హాజరుకావాల్సిందేనని సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. ప్రతి శుక్రవారం నాడు  సీబీఐ కోర్టుకు హాజరు కావాలనే విషయమై మినహాయింపును ఇవ్వాలని గతంలో కూడ కోర్టును జగన్ తరపున లాయర్లు కోరారు.  

ఇప్పటికే 10 దఫాలు జగన్ కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు ఇచ్చిన విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ నెల 10వ తేదీన సీబీఐ కోర్టుకు హాజరు కావాల్సిందేనని సీబీఐ ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్ తో పాటు ఏ 2 గా ఉన్న  విజయసాయిరెడ్డి కూడ కోర్టుకు హాజరుకావాలని కూడ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

దేశంలోని పలువురు ప్రజా ప్రతినిధులపై కేసులు ఉన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది. ఈ కేసుల్లో ఆయా సందర్భాల్లో  ప్రజా ప్రతినిధులు కోర్టుకు హాజరైన విషయాన్ని కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. చట్టానికి ఎవరూ కూడ అతీతులు కారని కోర్టు అభిప్రాయపడింది. అయితే ఈ నెల 10వ తేదీన మాత్రం కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది. 

 ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపును ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్  దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సీబీఐ కోర్టు 2019 నవంబర్ 1వ తేదీన కొట్టేసింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సీఎంగా ఉన్నందున ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుండి  మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టులో ఏపీ సీఎం వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు చేశారు.తన తరపున అడ్వకేట్ ఆశోక్‌రెడ్డి హాజరయ్యేందుకు అవకాశం ఇవ్వాలని సీబీఐ కోర్టును సీఎం జగన్ కోరారు. 

ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం జగన్ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. జగన్ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. 2019 అక్టోబర్ 18న ఆస్తుల కేసులకు సంబంధించి అటు జగన్ తరపు న్యాయవాది, సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. 

అదే రోజున వాదనలు ముగియడంతో తుది తీర్పును నవంబర్ 1కి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం జగన్ పాలనలో బిజీబిజీగా ఉండటంతో ప్రతీ శుక్రవారం తాను కోర్టుకు హాజరయ్యే అంశంపై మినహాయింపు ఇవ్వాలని కోరారు. 

ప్రతి శుక్రవారం విచారణకు తన బదులు తన తరపు న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని సీఎం జగన్ కోర్టుకు అప్పీల్ చేశారు.విజయవాడ నుంచి హైదరాబాద్​లోని కోర్టుకు హాజరు కావడానికి  ఖర్చు అవుతోందన్నారు.

రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తాను ఎక్కువ సమయం ఏపీలోనే కేటాయించాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కీలకమైన పథకాలను ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో మినహాయింపు కోరుతున్నట్లు జగన్ తెలిపారు. 

అయితే అక్టోబర్ 18న సీబీఐ కోర్టులో జరిగిన వాదనల్లో జగన్ అభ్యర్థనపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే కేసు విచారణకు తీవ్ర జాప్యం జరుగుతోందని సీబీఐ అభిప్రాయపడింది. వ్యక్తిగత హాజరు నుండి మినహాయిస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశ కూడ లేకపోలేదని సీబీఐ కోర్టులో తన వాదనలను విన్పించింది. అంతేకాదు   జగన్​కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తే కేసు విచారణ మరింత ఆలస్యం అవుతుందని వాదించింది. 

జగన్ రాజకీయ, ధన, అర్ధ, అంగ బలంతో సాక్షులను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదం పొంచి ఉందన్నారు.చట్టం ముందు అందరూ సమానులేనని ముఖ్యమంత్రి అయినంత మాత్రాన వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ కోర్టు ముందు తన వాదనను విన్పించింది.

గతంలో ఇదే అభ్యర్థనపై జగన్ దాఖలు చేసిన పిటిషన్​ను హైకోర్టు కొట్టివేసినందని సీబీఐ తరపు న్యాయవాది వాదించారు. ముఖ్యమంత్రిగా జగన్ హోదా పెరగొచ్చుగానీ కేసులో ఎలాంటి మార్పులు ఉండవని ఆరోపించారు. 

ఇకపోతే సీఎం జగన్ తాను పాదయాత్ర సమయంలో హైకోర్టులో అప్పీల్ చేసిన విషయం వాస్తవమేనని జగన్ తరపు న్యాయవాది వాదించారు. అయితే అది రాజకీయ పరమైన అంశం కావడంతో అందుకు హైకోర్టు అనుమతి ఇవ్వలేదని తెలిపింది. 

తనపై విచారణ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు తాను సాక్షులను ప్రభావితం చేయలేదని, తనపై ఏమైనా ఆరోపణలు వచ్చాయా అని జగన్ తరపు న్యాయవాది ప్రశ్నించారు.

 రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నాను కాబట్టే మినహాయింపు కోరుతున్నట్లు తెలిపారు.  అయితే ఈ విషయమై జగన్ లాయర్లు హైకోర్టుకు వెళ్లి వ్యక్తిగత మినహాయింపు ఇచ్చింది.ఈ తరుణంలో ఈ నెల 3వ తేదీన సీబీఐ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సీఎం వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. 

 

 

 


 

click me!