
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు (మంగళవారం) ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం జగన్.. ప్రధాని మోదీని కలవనున్నారు. రేపు సాయంత్రం ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నరు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్.. ప్రధాని మోదీతో చర్చించనున్నారు. పోలవరం సహా పెండింగ్ అంశాలపై ఈ సమావేశంలో సీఎం జగన్ చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. కొత్త జిల్లా ఏర్పాటు, త్వరలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరగనున్న నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.