తాగొచ్చి సతాయిస్తున్నాడని.. భర్తను రాయితో మోది హత్య చేసిన భార్య...

Published : Apr 04, 2022, 10:42 AM IST
తాగొచ్చి సతాయిస్తున్నాడని.. భర్తను రాయితో మోది హత్య చేసిన భార్య...

సారాంశం

నిత్యం తాగివచ్చి వేధింపులకు గురిచేసే భర్తతో విసిగిపోయిన భార్య దారుణానికి ఒడిగట్టింది. సహనం కోల్పోయి ఓ పెద్ద బండరాయితో అతని తల, మొహం మీద మోది హత్య చేసింది. 

అనంతపురం : Anantapurలో దారుణం జరిగింది. నిత్యం తాగి గొడవ పడుతున్న భర్తను భార్య రాయితో మోది murder చేసింది. నల్ల చెరువు మండలంలోని పల్లెవాండ్లపల్లికి చెందిన ముద్దిరెడ్డి వెంకటరెడ్డి (42) నిత్యం మద్యం తాగి వచ్చి భార్యను చితకబాదేవాడు. ఆదివారం రాత్రి కూడా మద్యం తాగి భార్యతో గొడవ పడ్డాడు. దీంతో సహనం కోల్పోయిన భార్య భాగ్యమ్మ రాయితో భర్త ముఖం మీద, తలమీద బాదడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై వరలక్ష్మి సిబ్బందితో కలిసి సంఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇదిలా ఉండగా, ఈ జనవరిలో ఇలాంటి ఘటనే తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ లో వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న woman, ప్రియుడి మోజులో పడి లోని ఇంట్లోనే extra marital affair కొనసాగించి భర్తకు పట్టుబడింది. తమ గుట్టు రట్టయ్యిందని భావించి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న husbandను ప్రియుడితో కలిసి కడతేర్చి కటకటాలపాలైన భార్య, ప్రియుడికి medchal కోర్టు life imprisonment విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చింది.

మేడ్చల్ మండలంలోని అక్బర్జాపేట్ గ్రామానికి చెందిన మహంకాళి లక్ష్మి, మహంకాళి కృష్ణ దంపతులు. అదే గ్రామానికి చెందిన గుంటి బాలరాజ్ 2014లో మహంకాళి కృష్ణ ఆటో కొనుగోలు చేశాడు. ఈ క్రమంలోపలు మార్లు వాళ్ళ ఇంటికి వెళ్లడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహాన్ని అడ్డుపెట్టుకుని తరచూ కృష్ణ ఇంటికి వెళ్లిన గుంటి బాలరాజు అతడి భార్య లక్ష్మితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది.

వీరి విషయం తెలియడంతో మహంకాళి కృష్ణ తన భార్యను మందలించాడు.  భర్త  అడ్డు తొలగించుకోవాలని మహాంకాళి లక్ష్మి, ప్రియుడు గుంటి బాలరాజ్ తో కలిసి పథకం వేసుకున్నారు. ఇందులో భాగంగా పలుమార్లు మహంకాళి కృష్ణకు కల్లులో నిద్రమాత్రలు కలిపి తాగించినా మృతుడికి ఏమీ కాలేదు.

తీగను మెడకు చుట్టి..   
2020 ఏప్రిల్ 8న రాత్రి సమయంలో మహంకాళి లక్ష్మి భర్త నిద్ర పోయిన తర్వాత  ప్రియుడు  గుంటి బాలరాజుకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకుని తమ అక్రమ సంబంధం కొనసాగిస్తుండగా వీరి శబ్దం విని నిద్రలేచిన కృష్ణ వారిని పట్టుకున్నాడు. దీంతో ముందే వేసుకున్న ప్లాన్ ప్రకారం కృష్ణను తీగలతో  మెడను బిగించి హతమార్చారు. హత్య విషయం బయటప పడకుండా కరోనా సమయంలో కల్లు దొరకకపోవడంతో మనస్తాపంతో మరణించినట్లు కట్టుకథ అల్లింది.

మృతుడి సోదరుడికి అనుమానం రావడంతో...
మృతుడి సోదరుడు మహంకాళి సురేష్ మృతుడి దేహంపై గాయాలు చూసి అనుమానం వ్యక్తం చేస్తూ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా గుర్తించి మహంకాళి లక్ష్మి, గుంటి బాలరాజును రిమాండ్ కు తరలించారు. కాగా మేడ్చల్ 11 ఏడీజే కోర్టులో సోమవారం కేసు విచారణకు రావడంతో న్యాయమూర్తి జయంతి కేసు విచారణ జరిపారు. ఇద్దరికి జీవితకాలం కఠిన కారాగార శిక్షతో పాటు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 

PREV
click me!

Recommended Stories

Jana Sena 13th Formation Day: వినూత్నంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు| Asianet News Telugu
AP Food Commission Chairman: ఉప్మాలో పురుగులు ఫిర్యాదు చేసిన పేరెంట్స్| Asianet News Telugu