దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభంపై వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. థర్మల్ కేంద్రాల దగ్గర బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు.
అమరావతి: దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభంపై చర్చ జరుగుతున్న తరుణంలో Andhra Pradesh సీఎం Jagan Mohan Reddy రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఇంధన శాఖ కార్యదర్శి ఎన్ శ్రీకాంత్, జెన్‌కో ఎండీ శ్రీదర్ సహా పలువురు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. Coal సరఫరా, Power కొరత రాకుండా అమలు చేస్తున్న అత్యవసర ప్రణాళికలు, దీర్ఘకాలిక వ్యూహాలను పరిశీలించారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్‌కు అధికారులు నివేదించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేసుకుంటూ తగిన చర్యలతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. మహానది కోల్ పీల్డ్స్ నుంచి రెండు ర్యాకుల బొగ్గు అదనంగా వచ్చిదని ఈ సందర్భంగా తెలిపారు. రాష్ట్రంలో జెన్ కో ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని 50 మిలియన్ యూనిట్ల నుంచి 69 మిలియన్ యూనిట్లకు పెంచామని చెప్పారు.
undefined
Also Read: ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం: ఆ కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
సింగరేణి సహా కోల్ ఇండియా తదితర సంస్థలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బొగ్గు తెప్పించుకోవడానికి సరుకు రవాణఆ షిప్పుల వినియోగం వంటి ప్రత్యామ్నాయాలనూ పరిశీలించాలని సూచించారు. తద్వారా రవాణా ఖర్చులు కలిసివస్తాయని వివరించారు. ఇందుకోసం సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకోవాలన్నారు. అవసరమైన విద్యుత్ సమీకరించుకోవాలని ఆదేశించారు. తాత్కాలిక చర్యలతోపాటు దీర్ఘకాలిక విద్యుత్ ఉత్పత్తి వ్యూహాలపై దృష్టిసారించాలని తెలిపారు.