అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా పై సస్పెన్షన్ వేటు: ఉత్తర్వులు జారీ

By narsimha lode  |  First Published Jan 19, 2024, 4:55 PM IST


అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాను సస్పెండ్ చేస్తూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.



అమరావతి :  అన్నమయ్య  జిల్లా కలెక్టర్ గిరీషాను  సస్పెండ్ చేస్తూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు  అన్నమయ్య జిల్లా కలెక్టర్ ను  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా  ఓటర్ల  జాబితాలో అక్రమాలు చోటు చేసుకున్నాయని పలువురు  కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అంతేకాదు డిజిటల్ లాగిన్ దుర్వినియోగం కావడం వంటి ఫిర్యాదుల నేపథ్యంలో  కలెక్టర్ పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో  గిరీషాపై  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకున్నారు. 

Latest Videos

undefined

తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికల జరిగిన సమయంలో  గిరీషా  తిరుపతి కార్పోరేషన్ కమిషనర్ గా పనిచేశారు.  

తిరుపతి లోక్ సభ స్థానంలో  30 వేలకు పైగా ఎపిక్ కార్డులను అక్రమంగా డౌన్ లోడ్ చేశారని ఫిర్యాదులు అందాయి.ఈ ఫిర్యాదులపై  విచారణ జరిగింది. డిజిటల్ లాగిన్ దుర్వినియోగమైన విషయం విచారణలో వెలుగు చూసింది. 

 వేల సంఖ్యలో ఎపిక్ కార్డుల్ని  డౌన్ లోడ్ చేసిన విషయాన్ని  కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు గుర్తించారు.  ఈ విషయమై గిరిషాను సస్పెండ్ చేయాలని ఈసీ ఆదేశించింది. దరిమిలా  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. 

గిరీషా ప్రస్తుతం  అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  దొంగ ఓట్ల విషయమై తెలుగు దేశం, వైఎస్ఆర్‌పీలు  పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్న విషయం తెలిసిందే.

ఇటీవల రాష్ట్రంలో మూడు రోజల పాటు  పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ కూడ  రాష్ట్రంలో  పరిస్థితిని సమీక్షించారు.  ఎన్నికల సన్నద్దతపై సమీక్ష చేసిన సమయంలో  విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని సీఈసీ వార్నింగ్ ఇచ్చారని మీడియా కథనాలు వెల్లడించాయి.



 

click me!