బీజేపీ నేతలతో బాబు భేటీ,మరునాడే ఢిల్లీకి జగన్: ఎందుకో తెలుసా?

By narsimha lode  |  First Published Feb 8, 2024, 2:29 PM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరగనున్నాయి.అయితే  ఈ తరుణంలో  ప్రధాన పార్టీలు  ఎన్నికలకు సిద్దమౌతున్నాయి.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  ఈ నెల  9వ తేదీన  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు.గురువారం నాడు రాత్రే  జగన్ న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.

కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయమై ప్రధానితో  సీఎం జగన్ చర్చించనున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  ఈ నెల 7వ తేదీన రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డాతో  భేటీ అయ్యారు.  బీజేపీ,  టీడీపీ మధ్య పొత్తుల విషయమై చర్చలు జరిగినట్టుగా ప్రచారం సాగుతుంది.ఈ చర్చలకు కొనసాగింపుగా  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడ ఇవాళ న్యూఢిల్లీకి వెళ్లనున్నారు. 

Latest Videos

undefined

also read:కోడికత్తి కేసు:నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

తెలుగు దేశం, జనసేన కలిసి పోటీ చేయనున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ కూటమిలో బీజేపీ చేరే అవకాశం ఉందనే ఊహగానాలు సాగుతున్నాయి.ఈ తరుణంలో బీజేపీ అగ్రనేతలతో  చంద్రబాబు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. 

also read:రాజ్యసభ ఎన్నికలు: వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులు వీరే

చంద్రబాబు  బీజేపీ అగ్రనేతలతో  చర్చించిన రెండు రోజులకే  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి న్యూఢిల్లీలో  ప్రధాన మంత్రితో భేటీ కావడం  ప్రస్తుతం  చర్చకు దారి తీసింది.రాష్ట్ర అభివృద్దికి సంబంధించిన అంశంపై  ముఖ్యమంత్రి చర్చిస్తారా, ఇతర అంశాలపై  కూడ చర్చిస్తారా అనే  విషయమై  చర్చ సాగుతుంది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే  ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన పార్టీల నేతలు  న్యూఢిల్లీకి వెళ్లడం ప్రస్తుతం చర్చకు కారణమైంది. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి  రేపు  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ది గురించి  జగన్ చర్చించనున్నారు.

2019 ఎన్నికలకు ముందు  బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది.  2019 ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చింది. తెలుగు దేశం పార్టీ  23 స్థానాలకే పరిమితమైంది.  ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  బీజేపీకి దగ్గర కావాలని తెలుగు దేశం పార్టీ సంకేతాలు ఇస్తుంది.ఈ క్రమంలోనే  అమిత్ షా ఆహ్వానం మేరకు చంద్రబాబు నాయుడు ఈ నెల 7వ తేదీన న్యూఢిల్లీకి వెళ్లారు. అమిత్ షా, జే.పీ. నడ్డాతో భేటీ అయ్యారు.


 

click me!